Mahashivaratri Celebrations in AP : రాష్ట్రంలోని ఇల కైలాస గిరులు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని తెల్లవారుజామున నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీరామలింగేశ్వర ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో వీరభద్రేశ్వరుడి ఆలయంలో తొలి పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం భక్తలతో కిటకిటలాడింది. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఘనంగా పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణతో ఆలయాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం
East Godavari : తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో చూపరులను ఆకట్టుకున్నాయి.
వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
Kakinada District : కాకినాడ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కుక్కుటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా కొవ్వూరులో గోదావరి ప్రధాన ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రధాన ఘాట్ గోష్పాద క్షేత్రంలో భక్తులు తెల్లవారు జాము నుంచి పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీకాళహస్తీలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు
Bapatla District : బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి బిందెతీర్ధంతో తొలిపూజని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
NTR District : ఎన్టీఆర్ జిల్లా కృష్ణా తీరంలో మహాశివరాత్రి సందడి నెలకొంది. మైలవరం మండలంలోని వెల్లడంలో శివాలయంలో భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. నందిగామ మండలం దాములూరు సంగమేశ్వరస్వామి శివనామస్మరణ మార్మోగింది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రసిద్ది శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.