Leopard Found in Dig : అడవిని వీడిన ఓ చిరుత పులి దారి తప్పి జనావాసాల సమీపంలోకి వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక ఖాళీ స్థలంలో తీసి ఉన్న గోతిలో పడిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామంలో పాత పేపరు మిల్లు ఉంది. ఇక్కడ కొన్నాళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు కొనసాగడం లేదు. కొందరు మేకల కాపరులు బుధవారం సాయంత్రం ఇటుగా వచ్చారు. ఆ ప్రాంతంలో చిరుత పులి అరుపులు వినిపించడంతో తొలుత భయపడ్డారు.
ధైర్యం చేసి సమీపంలోకి వెళ్లి చూడగా పేపరు మిల్లు స్థలంలోని ఓ గుంతలో చిరుత పులి పడి ఉండటాన్ని గమనించారు.ఈ విషయాన్ని గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నరసింహరావు, సబ్ డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి రెస్క్యూ బృందంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో బయటికి తీయడం కష్టమైంది. పులి గుంత నుంచి తప్పించుకోకుండా వలలు ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లాలో దారుణం - మహిళపై దాడి చేసి చంపేసిన చిరుత - women died leopard attacked
సురక్షితంగా బయటికి తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వనం నుంచి దాహార్తి తీర్చుకునేందుకు చిరుత పులి దేవనగర గ్రామ సమీపంలో స్వామి చెరువుకు వచ్చి ఉండొచ్చని అనంతరం ఇటుగా వచ్చి పేపరు మిల్లు గుంతలో పడి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న దేవనగర గ్రామస్థులు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిరుత గ్రామ సమీపంలోకి రావడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
నంద్యాలలో మరోసారి చిరుత కలకలం-భయాందోళనకు గురవుతున్న ప్రజలు - Cheetah In Mahanandi
Women Died Leopard Attacked : నంద్యాల జిల్లా శిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజులుగా గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో చిరుత సంచరిస్తోంది. అటువైపుగా వెళ్లిన ముగ్గురిపై దాడి చేసింది. ఇటీవల కట్టెల కోసం అడవికి వెళ్లిన మెహరున్నిషాపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.
చిరుతను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రం మహనంది పరిసరాల్లోనూ 10 రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది. ఆలయం చెంతనే ఉన్న నల్లమల అడవిలో చిరుత మకాం వేసింది. మహనంది ఆలయ సమీపంలో గోశాల వద్ద రోడ్డుపై చిరుత వచ్చి వెళ్లినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. చిరుతను పట్టేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.