ETV Bharat / state

'మ్యాథ్స్‌ ప్రాబ్లం చేయకపోతే మరీ ఇలా కొడతారా' - తల్లిదండ్రులు ఫైర్

జట్టుపట్టుకొని కిందకు లాగి విచక్షణారహితంగా కొట్టిన లెక్చరర్‌ - ఆయన తీరుపై తీవ్రంగా మండిపడిన తల్లిదండ్రులు

lecturer_brutally_beat_students_in_nandyala_district
lecturer_brutally_beat_students_in_nandyala_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Lecturer Brutally Beat Students in Nandyala District : అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగును నింపేవారే టీచర్​. అలాంటి టీచర్​కు పురాణాలు సైతం పెద్దపీట వేశాయి. పిల్లలు తప్పు చేస్తే ఓ అమ్మలాగా, నాన్నలాగా దండించే హక్కు టీచర్​కు ఉంది. విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ భావిభారత పౌరులుగా తయారు చేస్తారు. వారి భవిష్యత్తు బాగుపడాలని నిరంతరం శ్రమిస్తారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే మందలిస్తారు. అంతే కానీ ఒక మృగంలా మారి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

స్కూల్​కు వెళ్లనని చిన్నారి మారాం - అసలు విషయం తెలుసుకొని తల్లి షాక్​! - Teacher Misbehaved With Girl

డోన్ పట్టణంలోని శ్రీ సుధా జూనియర్ కళాశాలలో బీ దేవేంద్ర అనే వ్యక్తి మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తాజాగా తాను పిల్లలకు లెక్కలు చెప్తు, బోర్డుపై రాశారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్​ రెండవ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ గ్రూప్​ క్లాస్​ రూమ్​లోకి వెళ్లి బోర్డుపైన మ్యాథ్స్​ ప్రాబ్లం రాసి దానిని విద్యార్థులు సాల్వ్​ చేయాలని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థిని పిలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు ప్రాబ్లం సాల్వ్​ చేయడం రాక బోర్డ్​ దగ్గరే నిలబడి పోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లెక్చరర్​ విద్యార్థులను జుట్టు పట్టుకొని కిందికి లాగి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో విద్యార్థుల శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.

కళాశాల ముగించుకొని ఇంటికి వెళ్లిన విద్యార్థులు అక్కడ జరిగిన విషయం తల్లిదండ్రులు చెప్పాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు కళాశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. గురువు అనే వ్యక్తి విద్యార్థిని భయంలో పెట్టాలి కాని ఇలా తీవ్రంగా గాయపరచడం ఏంటని తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తుంది.

విచక్షణా రహితంగా విద్యార్థిని అలా కొట్టడమేంటని పలువురు మండిపడుతున్నారు. విద్యార్థి కేవలం చదువునే కాదు ఉపాద్యాయుడు జీవితాన్ని నేర్పించాలి. ఓపికగా వ్యవహరించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి కానీ ఇలా చేస్తారా ఇని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుమారుడిని కొట్టిన టీచర్ - చర్యలు తీసుకోవాలని తండ్రి పోరాటం - Father Complaint on teacher

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.