Irrigation Societies Election Process Postponed in AP : రాష్ట్రంలో గురువారం జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కలెక్టర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం పంపింది. ఇటీవల వచ్చిన తుపాను, భారీ వర్షాల కారణంగా సాగునీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేస్తునట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి నోటిఫికేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఎన్నికలు ఈనెల 8న జరగాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఈ నెల 11న, ప్రాజెక్టు కమిటీలకు ఈ నెల 14న ఎన్నికలు జరగాల్సి ఉంది.
తప్పులతడకగా ఓటర్ల జాబితా : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటి సంఘం ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా తప్పులతడకగా విడుదలైంది. దీనిని పరిశీలించుకున్న రైతులు ఒక్క ఓటు ఉండాల్సి ఉండగా ఎన్ని సర్వే నంబర్లు ఉంటే అన్ని ఓట్లు ఉండడంతో అయోమయంలో పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నీటి సంఘం ఎన్నికల సంబంధించిన ఓటర్ల జాబితే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఏళ్లుగా జరగని నీటి సంఘాల ఎన్నికలను ఈ సారి ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన నిర్వహించాలని ప్రణాళికలను సిద్ధం చేసింది.
విచారణ వేగవంతం - రేషన్ బియ్యం అక్రమార్కులకు ముచ్చెమటలు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే ఓటర్ల జాబితా తప్పులు తడకగా ఉండడం వల్ల ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాస్ పుస్తకం నుంచి ఆధార్ కార్డు ఉన్న కొందరు ఓటర్లు నమోదు కాలేదు. దీనిపై సంబంధిత అధికారులను అడిగితే సరైనా సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు. బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా ఇరిగేషన్ కింద 10 నీటి సంఘాలు, మైనర్ ఇరిగేషన్ కింద 50 నీటి సంఘాలు ఉన్నాయి.
సుమారు 6 వేల మంది రైతులు ఓటర్లుగా ఉన్నారు. అయితే ఓటర్ల జాబితా తప్పులు తడకగా ఉండడంతో రైతులు తమ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఓటర్ల జాబితాను సవరించి తప్పులు లేకుండా చూడాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
ఆ మూడు విషయాల్లో 'జీరో' ప్రగతి - వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం పురోగతిపై కేంద్రం