ETV Bharat / state

ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ - డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని పలువురికి ఆదేశాలు - IPS TRANSFERS IN AP - IPS TRANSFERS IN AP

IPS Officers Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

IPS TRANSFERS IN AP
IPS TRANSFERS IN AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 6:40 PM IST

Updated : Jul 13, 2024, 10:07 PM IST

IPS Officers Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎస్పీలను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కోన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​పై గతంలో దురుసుగా ప్రవర్తించిన గరుడ్ సుమిత్ సునీల్​ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్​ను నియమించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపికను బదిలీ చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్నను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డిని నియమించారు. కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్​ను నియమించిన ప్రభుత్వం, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్​కి గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్​ను నియమించారు. అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్​కు పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడీని బదిలీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1గా అజితా వేజెండ్లను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హాను నియమించారు. తూర్పుగోదావరి ఎస్పీగా డి.నరసింహ కిషోర్,
అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యా సాగర్ నాయుడులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.కె. మీనా నియామకం - MK Meena to Excise Department

కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు ను నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్. గంగాధర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీని బదిలీ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్ ను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ్​లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా ఎస్పీగా జీ.కృష్ణకాంత్​ను నియమించారు. ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్​గా మల్లికా గార్గ్​ను బదిలీ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా, కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించారు. అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణను బదిలీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడును నియమిస్తూ ఆదేశాలిచ్చారు.

సుబ్బారాయుడుకు ఎర్ర చందనం టాస్క్ ఫోర్సు ఎస్పీగానూ సుబ్బారాయిడుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎన్టీఆర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శాంతిభద్రతలుగా గౌతమీ శాలిని నియమించారు. ఇక ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవీని బదిలీ చేశారు. తదుపరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని జీఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కె.రఘువీరారెడ్డి, సిద్ధార్ధ్ కౌషల్, గరుడ్ సుమిత్ సునీల్, పి.జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం సత్తిబాబులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీ- మరో ఇద్దరు ఐపీఎస్​లు సైతం - IAS Officers Transfer

Last Updated : Jul 13, 2024, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.