ETV Bharat / state

స్వాతంత్య్ర దినోత్సవం - విజయవాడలో జెండా ఎగురవేయనున్న సీఎం - డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచంటే? - AP Ministers in Independence Day

AP Ministers in Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు జెండా ఎగురవేయనున్నారు. అదే విధంగా కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Independence Day
Independence Day (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 5:38 PM IST

AP Ministers in Independence Day: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా స్థాయిల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ జాతీయ జెండాను ఎగురవేస్తారని స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, పల్నాడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్​లు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే నెల్లూరులో మంత్రి నారాయణ, అనకాపల్లిలో హోం మంత్రి అనిత, చిత్తూరు జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ గోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు, కడప జిల్లాలో మంత్రి ఫరూఖ్, తిరుపతి జిల్లాలో మంత్రి రామనారాణ రెడ్డి జాతీయ జెండాకు గౌరవవందనం సమర్పించనున్నారు.

అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్, విశాఖ జిల్లాలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏలూరు జిల్లాలో మంత్రి పార్ధసారధి, ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్, పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్ధన రెడ్డి, కర్నూలు జిల్లాలో మంత్రి టీజీ భరత్, సత్యసాయి జిల్లాలో మంత్రి ఎస్.సవిత జాతీయ జెండాను ఎగురవేస్తారని ప్రభుత్వం తెలిపింది.

కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి వాసం శెట్టి సుబాష్, విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్నమయ్య జిల్లాలో మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి జెండాను ఆవిష్కరించనున్నారు. మరోవైపు అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భద్రతా దళాల నుంచి గౌరవ వందనం కూడా స్వీకరించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఆదివాసీ దినోత్సవం - గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం - CM CBN at Tribal Day Celebrations

Anna Canteens Opening: మరోవైపు ఈ నెల 15వ తేదీనే అన్న క్యాంటీన్లను సైతం ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆ దిశగా పనులు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుంది. టిఫిన్, లంచ్, డిన్నర్ హరేకృష్ణ ఫౌండేషన్ సరఫరా చేయనుంది. అన్నా క్యాంటీన్లకు ఫుడ్​ సప్లై కోసం పిలిచిన టెండర్లల్లో హరేకృష్ణ సంస్థ ఎల్-1గా నిలిచింది. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రెండో విడతలో 83, మూడో విడతలో 20 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

సామాన్య కార్యకర్తలకు గుర్తింపు - సచివాలయానికి పిలిపించి మాట్లాడిన చంద్రబాబు - CBN Met Activists in sachivalayam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.