Increasing Diarrhea Cases in Mogalrajapuram: విజయవాడలోని మొగల్రాజపురంలో సరఫరా అవుతున్న నీటిలో నైట్రేట్స్ ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. నిత్యం డయేరియా బాధితుల సంఖ్య పెరగడం స్థానికంగా కలవరపెడుతోంది. తాగునీటి సమస్యపై ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నీటి నమూనాలను సేకరించి మొబైల్ వ్యాన్ ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. మొగల్రాజపురంలో వైద్య శిబిరం వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. ఇప్పటివరకు 58 మంది అస్వస్థకు గురైతే పది మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని తెలిపారు.
కలరా వ్యాధికి దారితీసిన కలుషిత నీరు - గుంటూరులో ఇద్దరికి సోకిన వ్యాధి
Mogalrajapuram Water Contamination: విజయవాడలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అధికార యంత్రాంగం స్పందించింది. మున్సిపాలిటీ, వైద్యాధికారులు మొగల్రాజుపురానికి చేరుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి 1002 గృహాలకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. 10 మందికి సాధారణ చికిత్స అందించారు. 8 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కలుషిత నీరే మరణాలకు కారణంగా ఇప్పుడే చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
నీరు కలుషితం కావడానికి గల కారణాలు తెలుసుకోడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ ల్యాబ్‌ను తీసుకువచ్చారు. స్థానికుల నుంచి 30 నీటి నమూనాలను సేకరించారు. వాటిని కెమికల్ ఎనాలసిస్ పరీక్షలు చేశారు. కొన్ని నమూనాలను బాక్టీరియా పరీక్ష కోసం గుంటూరులోని ల్యాబ్‌కు పంపించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని నిలిపివేసి రెండు ట్యాంకులతో పంపిణీ చేశారు. అందులో ఓ ట్యాంకులోని నీరు రంగుమారిందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆ నీటిని కూడా పరీక్షకు పంపిస్తామని అధికారులు బదులిచ్చారు. కాలం చెల్లిన పైపులు మార్చకపోవడం, లీకేజీలను పట్టించుకోకపోవడం, మురుగు కాల్వల్లో పైపులు ఉండటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొగల్రాజుపురంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వైద్యులు తెలిపారు. వైద్య శిబిరం నిర్వహిస్తూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్లు వైద్యులు పేర్కొన్నారు.