ETV Bharat / state

గన్ కావాలా నాయనా? - ఐతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వు - డోర్‌ డెలివరీ చేస్తాం - GUNS DOOR DELIVERY IN HYDERABAD

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 1:44 PM IST

Guns Door Delivery in Hyderabad : నేటి కాలంలో ఏదీ కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే ఇంటికే వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. తాజాగా నేరగాళ్లు సోషల్‌ మీడియా, వివిధ వెబ్‌సైట్లలో ఆయుధాల దందాను నిర్వహిస్తున్నారు. తమను సంప్రదించిన వారికి డోర్ డెలివరీ చేస్తున్నారు.

guns_door_delivery_in_hyderabad
guns_door_delivery_in_hyderabad (ETV Bharat)

Weapons Door Delivery in Telangana : తెలంగాణలో ఆయుధాల దందా అంగట్లో సరకులా మారుతోంది. ఓ వైపు కొందరూ ఇవి తమ దగ్గర ఉంటే హోదాగా ఉంటుందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఆధిప‌త్యం చెలాయిచేందుకు, పంచాయితీలకు, ప్రత్యర్థులను బెదిరించేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిని ఉంచుకోవడం అక్రమమని తెలిసినా భయపడటం లేదు. దీంతో ఈ వ్యాపారం మూడు గన్‌లు ఆరు బుల్లెట్లుగా సాగుతోంది. ఇందుకోసం నేరగాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా దేశవాళీ తుపాకులు, పిస్టళ్లు అమ్మకానికి పెడుతున్నారు.

Gun Culture in Hyderabad : ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో, డార్క్‌నెట్‌లో వివిధ గన్‌ల చిత్రాలతో సహా పెట్టి అమ్మేస్తున్నారు. ఏ మోడల్‌ కావాలన్నా అందించేలా ఈ దందా నడుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో తమను సంప్రదించిన వారికి డోర్‌ డెలివరీ చేసేస్తున్నారు. ఇటీవల జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు వాహనాల సోదాలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద మూడు బుల్లెట్లు, ఒక దేశవాళీ తుపాకీ దొరికాయి. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పడంతో పోలీసులు షాక్‌ గురయ్యారు.

లాభదాయక వ్యాపారం : ఇతర రాష్ట్రాల్లో కొన్నప్పుడు రూ.50,000ల విలువుండే దేశవాళీ ఆయుధం, హైదరాబాద్‌ చేరుకునేసరికి నాలుగైదు రెట్లు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. కొందరు రౌడీషీటర్లు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారని వారు చెబుతున్నారు.

విశాఖలో తుపాకుల కలకలం - ఒకరు అరెస్ట్​ - police Seized two Illegal guns

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ - తర్వాత డెలివరీ : సోషల్ మీడియాలో ప్రత్యేక పేర్లు, సంకేతాలతో కొందరు పేజీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనే ఆయుధాల చిత్రాలు, ధర నిర్ణయించి పోస్ట్ చేస్తుంటారు. ప్రధానంగా యూపీ, బిహార్, ఒడిశా, రాజస్థాన్‌లోని కొందరు దేశవాళీ తుపాకులు ఈ విధానంలోనే విక్రయిస్తున్నారు. ఇందుకోసం డార్క్‌నెట్‌ మీద నిపుణుల సాయంతో శిక్షణ తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎక్కువగా గన్స్, మత్తు పదార్థాలు, యువతుల కోసం ఆన్‌లైన్‌లో వెతుకున్నట్లు నిపుణుల అధ్యయనంలోనూ వెల్లడైంది.

రైళ్లు, ట్రావెల్స్‌లో రవాణా : మరోవైపు అక్రమ ఆయుధాల్ని రవాణా చేసేందుకు నేరగాళ్లు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, రైళ్లను ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లకు బదులుగా, ప్రయాణికులు తక్కువగా ఉండే స్టేషన్లలో దిగిపోతారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనాలు లేదా ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానానికి చేరుస్తుంటారు. కొందరు ద్విచక్రవాహనాల మీద వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తోంది.

విశాఖలో 728 తుపాకులు స్వాధీనం- ఎన్నికల ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: సీపీ - Vizag CP Ravi Shankar

13వేల గన్స్​, రాకెట్ లాంఛర్లు.. సర్కార్​కు ప్రజలు రిటర్న్​.. అందువల్లే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.