ETV Bharat / state

లంచం ఇస్తేనే పంటకు నీళ్లు- అనంతపురంలో అధికారుల అవినీతి బాగోతం! - BRIBE FROM FARMERS FOR CROP WATER - BRIBE FROM FARMERS FOR CROP WATER

HLC Officials Demanded Bribe From Farmers in Anantapur District : లంచం ఇస్తే చాలు ఏదైన చేస్తామన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. రెండురోజుల క్రితం అధికారుల లంచం దాహానికి కడప జిల్లాలో ఓ కుటుబం ఆత్మహత్య ఘటన మరువకు ముందే, రైతులు పండించుకునే పంటకు నీళ్లు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటున్న అధికారుల బాగోతం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది వాటాల పంపకాల్లో తేడా రావడంతో ఈ అవినీతి బాగోతం బట్టబయలైంది.

HLC_Officials_Demanded_Bribe_From_Farmers_in_Anantapur_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 8:20 PM IST

Updated : Mar 24, 2024, 10:56 PM IST

HLC Officials Demanded Bribe From Farmers in Anantapur District : రాష్ట్రంలో ఎక్కడచూసిన అవినీతి రాజ్యమేలుతుంది. అధికారుల అవినీతి దాహానికి ఎన్నో కుటుంబాలు తనువు చలిస్తున్నా ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం. చివరికి రైతన్నలు పంటలు పండించేందుకు కూడా అధికారులు లంచం డిమాంచ్ చేసిన దారుణమైన ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

అనంతపురం జిల్లాలోని కణేకల్లు హెచ్చెల్సీ సబ్​ డివిజన్ కార్యాలయం పూర్తిగా అవినీతికి అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రైతులు పంటలు పండించేందుకు కూడా అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు. మోటార్లతో హెచ్చెల్సీ నుంచి పైపులతో నీటిని తోడుకున్న రైతుల వద్ద నుంచి ఓ అధికారి అక్రమంగా డబ్బు వసూలు చేస్తూ పట్టుబడిని ఘటన జరిగి ఏడాది గడవక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై తూతూ మంత్రంగా విచారణ చేపట్టిన అధికారులు తరువాత ఆ కేసును మూలనపడేశారు. ప్రస్తుతం అలాంటి ఘటనే మరోటి వెలుగులోకి రావటం గమనార్హం.

రైతుకు అధికారులు లంచం డిమాండ్​.. డబ్బు బదులు ఎద్దు ఇస్తానంటూ..

జిల్లాలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండల పరిసర ప్రాంత రైతులు హెచ్చెల్సీ (తుంగభద్ర ఎగువ కాలువ) కింద దాదాపు 35వేల ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. రైతులు ఈ కాలువ నుంచి మోటర్లతో నీటిని తోడుకొని పంటలు పండిస్తున్నారు. అయితే హెచ్చెల్సీ అధికారులు మాత్రం కాలువకు నీళ్లు వదిలేందుకు లంచం డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి బియ్యం, చెరువులోని చేపలు వాటాల రూపంలో ఇవ్వాలని కోరారు. దీంతో హెచ్చెల్సీ అధికారుల ఆదేశాలతో ఇటీవల కొందరు లస్కర్లు, రైతుల వద్ద నుంచి బియ్యం బస్తాలు (50 కిలోల చొప్పున) వసూలు చేశారు. రైతుకున్న భూమి విస్తీర్ణం ఆధారంగా ఒక్కొక్కరి నుంచి మూడు, నాలుగు బస్తాల వరకు తీసుకున్నారు. మొత్తం 150 బస్తాల బియ్యాన్ని పోగు చేశారు.

Officials Demanded to Farmers : ఇందులో కీలకంగా వ్యవహరించిన అధికారి, కిందిస్థాయి అధికారులకు మాత్రమే బియ్యంలో వాటా పంచి, కార్యాలయ సిబ్బందికి మొండి చేయి చూపడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది ఒకరికొకరు చర్చించుకుంటున్న వీడియో వెలుగులోకి రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాటాల పంపకంలో తేడా రావడంతో ఈ అవినీతి బాగోతం ఒక్కసారిగా బట్టబయలైంది.

కేసు నుంచి తప్పించేందుకు సీఐ లక్షా 20 వేలు అడిగాడు.. ఓ తల్లి ఆవేదన

అంతేగాక స్థానిక చెరువులో చేపల పెంపకందారుల నుంచి తీసుకున్న చేపల వాటాల వ్యవహారంపై కూడా అధికారుల మధ్య వాగ్వాదం దారి తీసింది. ఈ విషయాన్ని శనివారం డీఈ మద్దిలేటి, జేఈ అల్తాఫ్ వద్దకు వెళ్లింది. ఉన్నతధికారుల ఎదుటే 'వసూలు చేసిన బియ్యం మీరే పంచుకుంటే ఎలా ? మేము కూడా ఇక్కడ పని చేస్తున్నాం కదా ?' అని కార్యాలయ సిబ్బంది ఒకరు, లస్కర్లను ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. డీఈ కలగజేసుకుని సిబ్బందికి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.

అయితే అక్కడే ఉన్న హెచ్చెల్సీ డీఈ, జేఈలు అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా దాటవేత దోరణితో సమాధానం చెప్పడంతో కిందిస్థాయి అధికారులు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ప్రతి సంవత్సరం హెచ్చెల్సీ అధికారుల ఆదేశాలతో లస్కర్లు రైతుల వద్ద నుంచి బలవంతంగా బియ్యం, చేపలు, తదితర వ్యవసాయ ఉత్పత్తులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడడం, పైపులను పగులకొట్టాడం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హెచ్చెల్సీ అధికారుల అవినీతి ఆగడాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు.

టీచర్ల పైరవీల బదిలీలు.. లక్షల్లో దండుకుంటున్న అధికార పార్టీ నాయకులు

లంచం ఇస్తేనే పంటకు నీళ్లు

Last Updated : Mar 24, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.