Hindu Sanghas took important decisions: సనాతన సంప్రదాయాలు, ఆచారాలు, ధర్మాలను కాపాడి, గౌరవించే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని విజయవాడలో నిర్వహించిన హిందూ ధార్మిక సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్తు, హిందూ సంఘాలు, అట్లూరి నారాయణరావు ఛారిటబుల్ ట్రస్టు సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ధార్మిక సదస్సులో రాష్ట్రంలో హిందువుల ఆత్మగౌరవ పరిరక్షణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆనందాశ్రమ పీఠాధిపతి, ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.
రాష్ట్రంలో ఐదేళ్లుగా హిందువుల దేవాలయాలపై, అర్చకులపై ముప్పేట దాడులు, దౌర్జన్యాలు జరిగాయని, ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు జరిగినా జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం పిచ్చి వాళ్లు, మతిస్థిమితం లేని వాళ్ల చర్యగా వాస్తవాలను దాటవేస్తూ వచ్చారని విమర్శించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి హిందువులంటే పిచ్చివాళ్లు, మతిస్థిమితం లేని వాళ్లుగా కనబడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇస్తే మున్ముందు హిందూ సనాతన గౌరవం, ధర్మం కోల్పోతామని ఆవేదన చెందారు. రామతీర్థంలో రాముడు శిరస్సును ఖండించినా ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయారని, హిందూ సమాజంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు తప్పనిసరిగా మార్పు కోరుకుంటున్నారని, అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఏపీలో దేవాలయాలకు భూములిచ్చేందుకు ప్రజలు మందుకు రావడం లేదు: హిందూ ధార్మిక పరిషత్
వైఎస్సార్సీపీ ప్రభుత్వం మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని దుయ్యబట్టారు. పాస్టర్లకు జీతాలు ఇచ్చి హిందువులు- క్రైస్తవులు మధ్య వివాదాలకు ఆజ్యం పోశారని విమర్శించారు. ఆలయాల సంస్కృతిని, సంప్రదాయం దెబ్బతీయడంతోపాటు - తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంటగలిపారని ఆరోపించారు. రాష్ట్రంలోని పరిస్థితులను తీవ్రంగా పరిగణిస్తూ మార్పు కోసం అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మత విభజన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఓటు ద్వారా చేటు కల్పించాలని కోరారు. రాబోయే రోజుల్లో హిందువుల మనోభావాలను గౌరవించే ఏ పార్టీలు మన ముందుకు వస్తున్నాయో ఆ పార్టీలను మనం గౌరవిద్దామని అన్నారు. మహా కూటమి పార్టీలు ప్రభుత్వంగా అధికారంలోకి వస్తే హిందువులకు న్యాయం జరుగుతుందని- ఆలయాలు నిత్యదూపదీప కైంకర్యాలతో కళకళలాడుతాయని అభిలషిస్తున్నామని ప్రకటించారు.
కోతిపై గ్రామస్థుల ప్రేమ- సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
జగన్ ప్రభుత్వం హిందువులకు చేసిన అన్యాయం ఆవేదన కలిగిస్తోందని- అధికార పార్టీ నేతల వికృత చేష్టలకు అడ్డులేకుండా పోయిందని హిందూ ధార్మిక సంస్థ తెలిపింది. అర్చకుని మెడలోని జంధ్యాలను తెంపి కాలుతో తన్నారని, అర్చకుల చెంపలు పగలగొట్టారని, గర్భగుడిలో మధ్యవర్తిగా ఉండి పూజలు చేసే పూజారిని కాల రాసిన ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితి లేదని ముక్త కంఠంతో నినదించారు. వచ్చే రోజుల్లో హిందువుల ఆలయాలు పరిరక్షించబడాలంటే ఈ ప్రభుత్వం పోవాలని, తిరుమల వేంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఇతర దేవీదేవతలు మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా అనుగ్రహించాలని స్వాములు, మాతాజీలు, సాధుసంతులంతా కోరారు. సదస్సులో పది తీర్మానాలు చేశారు.
రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం