AP High Court Hearing Sajjala Petition : తనపై ఉన్న లుక్ ఔట్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషన్‌పై విచారణ సీజే(CJ) బెంచ్‌కు బదిలీ చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పై మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల సజ్జలపై గుంటూరు ఎస్పీ LOC (Look out circular) జారీ చేశారు.
లుక్‌అవుట్ నోటీసులు జారీ : వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు అయినా విచారణ చేయలేదు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని తాజాగా గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆపార్టీ నేతలు నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్‌ను ఇప్పటికే ఫలు దఫాలుగా పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు.
సజ్జలపై సర్య్కులర్ - ముంబయి విమానాశ్రయంలో ఆపిన అధికారులు
ఇప్పటికే సగానికిపైగా విచారణ పూర్తి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసులతో కలిసి తదుపరి విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. అయితే ఈ కేేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 120వ నిందితుడిగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుల జాబితాలో కొన్ని పేర్లు పునరావృత్తం అయ్యాయని వారిలో అసలు నిందితులను నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు తొలగిస్తామని పోలీసు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అప్పటి వరకు ఆయన ఈ కేసులో 120వ నిందితుడేనని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల ఎదుట అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల – వేలు చూపించి పొన్నవోలు వాగ్వాదం