ETV Bharat / state

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు - ఐదుకు చేరిన మృతులు - రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం - LANDSLIDES IN VIJAYAWADA - LANDSLIDES IN VIJAYAWADA

Heavy Rains in AP: అల్పపీడనం వల్ల రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

LANDSLIDES IN VIJAYAWADA
LANDSLIDES IN VIJAYAWADA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 11:35 AM IST

Updated : Aug 31, 2024, 7:54 PM IST

Heavy Rains in AP: బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి: విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరొ ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ముందుగా నలుగురు మృతి చెందగా తాజాగా రాళ్ల మధ్య సంతోష్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన తదితరులు చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. కొండ చెరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు మేఘన, బి. లక్ష్మీ, అన్నపూర్ణ, లాలో పూర్కయత్​గా అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారోనని అధికారులు పరిశీలిస్తున్నారు.

సీఎం చంద్రబాబు విచారం: ఈ ఘటనలో నలుగురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. అంతే కాకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వాహనదారులు తీవ్ర ఇబ్బందులు: రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామవరప్పాడు రింగ్‌రోడ్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. రింగ్‌రోడ్‌ నుంచి నిడమానూరు వరకు వర్షపు నీటిలోనే కార్లు, బైకులు ఆగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని వన్ టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్​లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్‌ఆర్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీటిలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు - Heavy Rains in Andhra Pradesh

MP Kesineni Chinni on Heavy Rains: భారీ వ‌ర్షాల కార‌ణంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధికారుల‌ను అప్రమ‌త్తం చేశారు. అన్ని శాఖల‌ అధికారులు, సిబ్బంది అలెర్ట్​గా ఉండి అవ‌స‌ర‌మైన స‌హాయక చ‌ర్యలు త‌క్షణం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. మ్యాన్ హోల్స్, కరెంట్ తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన సూచించారు. పొంగే వాగులు, వంకల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా న‌దీ ప‌రివాహాక ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల‌న్నారు. లోత‌ట్టు ప్రాంత ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారుల‌కి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటిక‌ప్పుడు అధికారుల‌తో ఎంపీ కేశినేని చిన్ని ప‌రిస్థితి స‌మీక్షిస్తున్నారు.

విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌లో కలెక్టర్‌ సృజన సమీక్షిస్తున్నారు. మొన్నటినుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. కొండప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గి రోడ్లపై నీరు తగ్గేంతవరకు బయటకు ప్రజలు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

MLA Bonda Uma on Rains: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్థానికులకు భోజనం, టిఫిన్ ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని బొండా ఉమా అన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు.

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Heavy Rains in Andhra Pradesh

Last Updated : Aug 31, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.