ETV Bharat / state

శంకుస్థాపన చేసి 15 ఏళ్లు - ఇంకా పూర్తి కాని గుణదల ఫ్లైఓవర్​ - Gunadala Flyover Construction - GUNADALA FLYOVER CONSTRUCTION

Gunadala Flyover Construction Work Not Completed Since 15 Years : గుణదల పై వంతెన నిర్మాణానికి వైఎస్సార్సీపీ నాయకులు తిలోదకాలొదిలారు. ఏళ్ల తరబడి ప్రజలు సమస్యలు పడుతున్నా పట్టింకోలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుణదల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే గేటు దాటాలంటే నరకం చూస్తున్నారు. రైల్వే గేటు పడితే ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

gunadala_flyover_construction_work_not_completed_since_15_years
gunadala_flyover_construction_work_not_completed_since_15_years (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 2:25 PM IST

Gunadala Flyover Construction Work Not Completed Since 15 Years : విజయవాడ గుణదల పైవంతెనకు శంకుస్థాపన చేసి 15 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. దీంతో నున్న, నూజివీడు ప్రాంతాల నుంచి విజయవాడ నగరంలోకి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంతెన పూర్తి చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో ఈ సమస్యపై మాట్లాడారు. ఈ ప్రాంతంలో బొండా ఉమ పర్యటించి త్వరలోనే పనులు చేపడతామని ప్రకటించడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

గుణదల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే గేటు దాటాలంటే నరకం చూస్తున్నారు. రైల్వే గేటు పడితే ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న బుడమేరు, రైవస్, ఏలూరు కాలువలు దాటుతూ ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు. నున్న, నూజివీడు వంటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి ఇదే దగ్గర దారి కావడంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే గేటు పడితే అరగంట వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2009లో అప్పటి ప్రభుత్వం 36 కోట్ల రూపాయలతో వంతెనకు శంకుస్థాపన చేసింది. నేటికీ వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుణదల రైల్వే పై వంతెన నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

'2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ వంతెనను పూర్తి చేయాలని చూసినా న్యాయపరమైన సమస్య కారణంగా సాధ్యం కాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణంపైన నిర్లక్ష్యం ప్రదర్శించింది. అవసరమైన భూసేకరణ వరకు పూర్తి చేసినా వంతెన నిర్మాణ పనుల్లో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాం.' - స్థానికులు

బిల్లుల చెల్లింపులో వైఎస్సార్సీపీ సర్కార్​ జాప్యం - ఆగిన నందివెలుగు ఫ్లైఓవర్‌ పనులు - YSRCP Neglect Nandivelugu Flyover

ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శనివారం పర్యటించి ఈ వంతెన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.