ETV Bharat / state

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్​ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims - DONATE FOR FLOOD VICTIMS

Government Gave Accounts For Donations: వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాతలకు సమాచారం అందించేందుకు హెల్ప్​ లైన్​ నెంబరు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా కూడా సహాయం చేయవచ్చని అధికారులు తెలిపారు.

Government Gave Accounts For Donations
Government Gave Accounts For Donations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 8:47 PM IST

Updated : Sep 3, 2024, 9:54 PM IST

Government Gave Accounts For Flood Victims Donations : వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు చేశారు.

ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు. ధన సహాయం చేసే దాతలు ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా ఈ క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమ చేయవచ్చని అధికారులు తెలిపారు.

బ్యాంక్ ఖాతాల వివరాలు:

State Bank Of India:

A/c Name : CMRF
A/c Number : 38588079208
Branch: AP Secretariat
IFSC code : SBIN0018884

Union Bank of India:
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : UBIN0830798.

"మేమున్నాం" అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations to help flood victims

లోకేశ్​కు చెక్కు అందజేసిన దాతలు : వరద బాధితుల కోసం సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన లక్ష్మీ, వెంకటనారాయణ దంపతులు రూ.1.2 లక్షల చెక్కును మంత్రి నారా లోకేశ్​కు అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌కు మంత్రి టీజీ భ‌ర‌త్ విరాళం: వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్​ ఫండ్​కు రూ.10 లక్షల విరాళాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అంద‌రూ సాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో అందరూ అండగా నిలవాలని మంత్రి భ‌ర‌త్ కోరారు.

పెద్ద మనసు చాటుకున్న సినీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

Last Updated : Sep 3, 2024, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.