ETV Bharat / state

ఉద్దండరాయునిపాలెం వైపు దూసుకెళ్లిన CRDA జేసీబీలు - అక్రమ కట్టడాల కూల్చివేత

సీఆర్డీఏ స్థలంలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన సీఆర్‌డీఏ అధికారులు

former-ycp-mp-nandigam-suresh-illegal-construction-demolished
former-ycp-mp-nandigam-suresh-illegal-construction-demolished (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 20 minutes ago

Former YCP MP Nandigam Suresh Illegal Construction Demolished : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని అక్రమ కట్టడాలను సీఆర్డీఏ(CRDA) అధికారులు కూల్చేశారు. వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ తాను ఎంపీగా ఉన్న సమయంలో CRDAకు చెందిన ఎకరం స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారు. అయిన అప్పటి సీఆర్డీఏ అధికారులు వీటిపై కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. వీటిలోనే అర్ధరాత్రి వరకు విందులు చేసుకుంటూ సెటిల్‌మెంట్‌ చేసేవారు. విజయవాడ నుంచి యువతను తీసుకొచ్చి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాన్ని నిర్మాణాలపై సీఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. ఉద్దండరాయినపాలెంలో సురేష్ అక్రమంగా నిర్మించిన నివాసాలను సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజధానిలో పంటల సాగు చేపట్టి భారీగా లబ్ధి : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులు, నాయకులు చేసిన అక్రమాలకు అంతే లేదు. రాజధానికి చెందిన భూముల్లో అనధికారికంగా పంటల సాగు చేపట్టి భారీగా లబ్ధి పొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

'పెత్తనం చెలాయించిన చోటే నిందితుడిగా' - చక్రం తిప్పిన స్టేషన్​ సెల్​లో బందీగా మారిన మాజీ ఎంపీ

ఉద్దండరాయునిపాలెం వైపు దూసుకెళ్లిన జేసీబీలు - మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అక్రమ కట్టడాలు కూల్చివేత (ETV Bharat)

పలువురు ఉద్యోగుల సహాయంతో అక్రమాలు : తుళ్లూరు మండలం శాఖమూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జొన్నకూటి ప్రశాంత్‌తో పాటు మరికొంత మంది సుమారు 50 ఎకరాల సీఆర్డీఏ భూముల్లో అనధికారికంగా పంటలు సాగు చేస్తున్నారు. సీఆర్డీఏ రీజనల్ కార్యాలయం సమీపంలో ఉన్న లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, ఐనవోలు, రాయపూడి, మందడం ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. వీరిలో నందిగం సురేష్ అనుచరులూ ఉన్నారు. సీఆర్డీఏలో గతంలో వైఎస్సార్సీపీ నాయకులతో అంటకాగిన పలువురు ఉద్యోగుల సహాయంతో పంటలు సాగు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

"రాజధాని అమరావతి భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న వాటిని తొలగిస్తున్నాం. ఇంట్లోని వస్తువులు ఖాళీ చేయడానికి కొంతమంది రేపటి వరకు సమయం కాావాలని కోరారు. అందుకోసం కొన్నింటిని వదిలేశాం. ఈరోజు కొన్నింటిని తొలగించాం. రాజధాని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కనుక ఎటువంటి అక్రమాలు ఉన్న తొలగిస్తాం. ఇప్పటికే మైక్​లలో సైతం ప్రచారం చేశాం." - విశ్వేశ్వర నాయుడు, సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్

పోలీసు కస్టడీకి నందిగం సురేష్‌ - శని, ఆదివారాల్లో విచారణ

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌ - మహిళ హత్య కేసులో 14 రోజులు రిమాండ్ - NANDIGAM SURESH REMANDED

Last Updated : 20 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.