ETV Bharat / state

రుషికొండపై కాటేజీలు కూల్చివేత - విచారణ అధికారిగా మాజీ మంత్రి రోజా ఓఎస్డీ - Rushikonda Cottages Demolition - RUSHIKONDA COTTAGES DEMOLITION

Rushikonda Cottages Demolition Inquiry : విశాఖలో ప్రాజెక్టుల కేటాయింపులపై జగన్​కు అనూకులంగా ఉన్న అధికారులు మరోసారి ఉడతా భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో అక్రమాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు వింత పోకడకు తెరలేపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకే విచారణ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

Rushikonda Cottages Demolition Inquiry
Rushikonda Cottages Demolition Inquiry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 12:21 PM IST

Updated : Sep 18, 2024, 12:55 PM IST

Rushikonda Cottages Demolition Inquiry : ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థలో కొందరు ఉన్నతాధికారులు గత వైఎస్సార్సీపీ సర్కార్​పై ఇంకా కృతజ్ఞత చాటుకుంటూనే ఉన్నారు. అప్పట్లో జరిగిన ఘోర తప్పిదాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అప్పటి ప్రభుత్వంలో జరిగిన కొన్ని అక్రమాలపై అదే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన అధికారులకే విచారణ బాధ్యత అప్పగించడమే ఇందుకు నిదర్శనం.

విశాఖలో పలు పర్యాటక ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ సర్కార్ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాక రుషికొండపై కాటేజీలు కూల్చేసినపుడు అందులోని రూ.కోట్ల విలువైన మంచాలు, సోఫాలు, ఏసీలు, డైనింగ్‌ టేబుళ్లు వంటివి అప్పటి అధికారులు కొందరు మాయం చేశారనేది ఫిర్యాదు. వీటిపై నిబద్ధత కలిగి ఎలాంటి అభియోగాలు లేని అధికారులతో విచారణ చేయించాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రి రోజా వద్ద ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పని చేసిన రాజారాం మనోహర్‌కు విచారణ బాధ్యత అప్పగించడం విశేషం.

Rishikonda Resorts Demolition Issue : రాష్ట్ర ఆడిట్‌శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న రాజారాం మనోహర్‌ ఎన్నికలకు ముందువరకూ మంత్రి రోజా వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. ఎన్నికల నియమావళి ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు డిప్యుటేషన్‌పై ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు వచ్చారు. ఇక్కడ కూడా కీలకమైన విజిలెన్స్, మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా ఆయనను అప్పట్లో నియమించారు. విశాఖలో ప్రాజెక్టులు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిన అంశంపై రాజారాంతో విచారణ జరిపించాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు.

విశాఖలో ఏం జరిగిందన్న వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న ఉద్దేశం ఉన్నతాధికారుల్లో ఉన్నట్లుగా కనిపించడం లేదని ఈ నిర్ణయాన్ని గమనించిన వారు అభిప్రాయపడుతున్నారు. విజిలెన్స్‌ విభాగంలోని మరికొందరు అధికారులు, ఉద్యోగులతో కలిసి రాజారాం మనోహర్‌ రెండు రోజుల క్రితం విశాఖకు వెళ్లి తూతూమంత్రంగా విచారణ జరిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ, సీఐడీ వంటి సంస్థలతో విచారణ చేయిస్తే గత సర్కార్​లో జరిగిన బాగోతాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

AP CM Camp Office at Rushikonda: పూటకో మాట మారుస్తూ వచ్చారు.. ఎట్టకేలకు రుషికొండ నిర్మాణాలపై క్లారిటీ..!

జగన్‌ రాజభోగం, క్యాంపు కార్యాలయానికి ఇంత ఖర్చా? ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Last Updated : Sep 18, 2024, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.