ETV Bharat / state

సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షాతిరేకాలు- ప్రత్యకంగా ధన్యవాదాలు తెలిపిన పీవీ రమేశ్ - PV Ramesh about Land Titling Act - PV RAMESH ABOUT LAND TITLING ACT

Ex-IAS reacts on Land Titling Act cancellation: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ పీవీ రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. గతంలో కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో తన తండ్రి పట్టా భూమిని మ్యూటేషన్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశారు. అవసరం లేని చోట అవగాహన లోపంతో గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని పీవీ రమేష్ ఎద్దేవా చేశారు.

FORMER IAS OFFICER PV RAMESH
FORMER IAS OFFICER PV RAMESH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 3:32 PM IST

Ex IAS PV Ramesh Tweet Over Land Titling Act: తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్​ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే, సీఎం హోదాలో రెడో సంతకమే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రైతుల భూములపై హక్కులను లాక్కునే ఈ చట్టం రద్దును అంతా స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సైతం స్పందించారు.

ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ పై మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు పివీ రమేష్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కృష్ణాజిల్లా విన్నకోట గ్రామం లో తన తండ్రి పట్టా భూమిని మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తహసిల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు ఆర్డీవోకు పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారనీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టం రాకముందే తన తల్లిదండ్రుల భూములపై హక్కులు నిరాకరిస్తున్నారనీ గతంలో పీవీ రమేష్ వెల్లడించారు.

భూభక్ష చట్టం రద్దుపై హర్షాతిరేకాలు - రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్న రైతులు, న్యాయవాదులు - Farmers celebrations in ap

ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలందించిన తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతులు ఈ చట్టంతో ఏమైపోతారో అని గతంలో పివి రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అంటూ ఇంకా ఎమ్మెల్సీలు, ఎంపీలకు మాజీ సీఎం జగన్ ఇంకా చెప్పటం పై పివి రమేష్ స్పందించారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ లో అసలు అవసరమే ఉండదు అంటూ ఆధారాలతో సహా స్పష్టతవచ్చిందన్నారు. నీతి అయోగ్ సలహా మండలి సెక్యూర్ టైటిలింగ్‌ లేని భూముల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించిందని వెల్లడించారు. 200 ఏళ్ల ముందు బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కు రైత్వారి సెటిల్మెంట్ అప్పుడే జరిగిందని స్పష్టంచేశారు. రైత్వారి సెటిల్మెంట్ ద్వారా అమలవుతున్న విధానం 1820 నుండి సమర్థంగా పనిచేస్తుందని పివి రమేష్ తన పోస్టులో గుర్తు చేసుకున్నారు. అవసరం లేని చోట అవగాహన లోపంతో గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని తేల్చేచెప్పారు. ఈ చట్టం ద్వారా తనతో పాటు సామాన్య రైతులు కూడా ఇబ్బందులు పడతారని అప్పట్లో పోస్ట్ చేసినట్టు వెల్లడించారు.

5 ఫైళ్లపై సంతకాలు చేసి సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ - Congratulation Meeting to CBN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.