Five Years Old Boy Missing in Hospital Found Safe in Doctor Room : సాయం అని అడగాలని తెలిసిన వయసు కాదు. ఏడుపే ఆ వయసులో అన్నింటికీ సూచన. కానీ ఆ ఐదేళ్ల చిన్నారి బధిరుడు( పుట్టు మూగ, చెవులూ వినబడవు). చుట్టూ గోడలు, మరో మనిషి లేరు, చీకటి, ఆకలి కనీసం భయాన్ని కూడా ప్రదర్శించలేని నిస్సహాయత. ఇదీ ఐదేళ్ల సుజిత్ పరిస్థితి. చివరకు ఏం చేశాడా? బాలుడు బతికి భయటపడ్డాడా? ఎలా? అసలెక్కడ చిక్కుకున్నాడు? ఇంతకీ ఏం జరిగి ఉంటుంది. అవన్నీ తెలుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
అసలేం జరిగిందంటే!
kurnool sarvajana hospital : మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. తల్లిదండ్రులను, ఆసుపత్రి సిబ్బందీని ఆందోళనకు గురిచేసిన ఈ ఘటన బాలుడు సురక్షితంగా (Safe) ఉండటంతో సుఖాంతమయ్యింది.
బిడ్డ అదృశ్యంపై తల్లి ఆందోళన - వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కుమారుడు సుజిత్ (5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఈ నేపథ్యంలో శస్త్రచి కిత్స నిమిత్తం 20 రోజుల కిందట ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా (Anesthesia) విభాగాధిపతి గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది అదే సమయంలో ఆ గదిని శుభ్రం చేసి చిన్నారిని గమనించకుండా తాళం (Lock) వేసుకుని వెళ్లిపోయారు. కుమారుడు కనపడకపోవడంతో సిబ్బందికి తల్లి సమాచారం ఇచ్చారు. వారు ఎంత ప్రయత్నించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఆ వైద్యుడి గది తలుపులు తెరవగా సుజిత్ కనపడటంతో సిబ్బంది అవాక్కయ్యారు. తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. పిల్లాడు ఆ గది ఫ్రిజ్లో ఉన్న నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాడని సిబ్బంది తెలిపారు.
పట్టాలపై గుంత.. రైలుకు ఎదురెళ్లిన పదేళ్ల బాలుడు.. వందల మంది ప్రాణాలు సేఫ్!
పిల్లాడు ఒక రోజంతా గదిలో ఉండి ఫ్రిజ్లో ఉన్న నీటిని తాగి జీవం నిలుపుకున్నాడు. ఇదే మరోలా జరిగి ఉంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఎవరు బాధ్యులు అని వార్డు సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉండగా పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.