ETV Bharat / state

ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులు - రోజుకో రైతు బలవన్మరణం - Farmers Suicides In AP - FARMERS SUICIDES IN AP

Farmers Suicides in YSRCP Regime of AP: సీఎం జగన్​ పాలనలో రైతుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. పంటల దిగుబడి, మద్దతు ధర రాకపోవడంతో సాగు కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులకు అప్పులు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహరాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు అందించలేదు.

Farmers Suicides in YSRCP Regime of AP
Farmers Suicides in YSRCP Regime of AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 10:29 AM IST

Updated : Apr 19, 2024, 11:59 AM IST

ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులు - రోజుకో రైతు బలవన్మరణం

Farmers Suicides in YSRCP Regime: దేశంలోనే మూడో స్థానం ఇది వినడానికి బాగున్నా ఏ విభాగంలో వచ్చిందో తెలిస్తే గుండెలు తరుక్కుపోతాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్​కు దక్కిన స్థానమిది. అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారిన పరిస్థితి. సీఎం జగన్​ ఐదేళ్ల పాలనలో రైతుల జీవితాలను అల్లకల్లోలమయ్యాయి.

గిట్టుబాటు ధర ఏది జగనన్నా - నిమ్మరైతుల ఆవేదన - Lemon Farmer Problems in AP

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగసకల్లుకు చెందిన జయరాముడు కుటుంబానికి ఉమ్మడిగా ఆరు ఎకరాల పొలముంది. మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, ఆముదం వేసేవారు. బ్యాంకు నుంచి రూ.5.90 లక్షలు, ప్రైవేటుగా రూ.4 లక్షలు అప్పుగా తెచ్చి 14 బోర్లు వేయించినా అరకొర నీళ్లే వచ్చాయి. దాంతో ఏడు సంవత్సరాలపాటు నష్టాలే మిగిలాయి. సొసైటీ అధికారులు నోటీసు పంపడంతో పొలం వేలానికి పోతుందనే ఆవేదనతో జయరాముడు తొమ్మిది నెలల కిందట ఉరేసుకున్నారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమార్తెలున్నారు. అయిదుగురికి వివాహాలు చేయగా చిన్న కూతురు పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసైనా చదువు మాన్పించారు. కాలేజీకి పంపాల్సిన బిడ్డను కూలీ పనులకు తీసుకెళ్తున్నానని ఆ తల్లి కన్నీరు పెట్టుకున్నారు.

వైసీపీ పాలనలో రైతులకు మిగిలింది కన్నీళ్లే: వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు, కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్‌ పాలనలోనే దాపురించింది. మిరప రైతులకు నష్టం నషాళానికి అంటింది. పత్తి రైతులు తెల్లబోయారు. ఉద్యాన రైతులైతే జగన్‌ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టాలను బరించి వ్యవసాయం చేస్తున్నా కాలం మాత్రం కరుణించడం లేదు. ఏడాదిలో రెండు, మూడు సార్లు పంటల మునిగిపోవడం ఆపై కరవు కాటకాలు. రూ.లక్షల్లో పెరుగుతున్న అప్పులు, వాటిపై వడ్డీల్ని తలచుకుని రైతు కుటుంబాలకు అన్నం సయించడం లేదు. ఇదిగో ఈ ఏడాది కలిసొస్తుందేమో అంటూ ఆశల సేద్యం చేసి చేసి అలసిపోతున్నారు. నిస్సహాయ స్థితిలో నమ్ముకున్న పొలంలోనే కొందరు నిర్జీవులవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సగటున 1,100 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.7 లక్షలు ఇస్తామనే హామీనీ సక్రమంగా అమలు చేయడం లేదు.

మరణించిన రైతు కుటుంబాలకు సహాయం అందేదెప్పుడు?

మాది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం. ఆర్‌బీకేల ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనంతగా రైతు భరోసా ద్వారా పెట్టుబడిలో 80% మేమే ఇస్తున్నాం. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా మారింది. మా ఏలుబడిలో వ్యవసాయం సుసంపన్నంగా ఉందంటూ సీఎం జగన్‌ కొన్ని వందల సార్లు బాకాలు ఊదారు. ఎన్నికల ప్రచారంలోనూ పదేపదే అదే మాట చెబుతున్నారు. రాయలసీమలో ఎండిన పంటల సంగతేంటి. డెల్టాలో ధర దక్కని వరి రైతు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో సాగెందుకు తగ్గుతోంది. ఉత్పత్తి ఎందుకు పడిపోతోందో పెట్టుబడిలో 80% ఇస్తుంటే ఏ రైతును కదిలించినా రూ.లక్షల్లో అప్పులయ్యాయని ఎందుకు కన్నీరు పెడుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉరికొయ్యకు రైతులు ఎందుకు వేలాడుతున్నారు. ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే వృత్తినే ఎందుకు వదిలేస్తున్నారు. కరవుతో అల్లాడుతున్న రైతుల కష్టాలను పరిశీలించడానికి మనసు రాని ఈ పాలకుడికి, తుపానుతో నష్టపోయిన పంటలను చూడడానికి కార్పెట్‌ వేయించుకున్న ఈ సీఎంకు అసలు వ్యవసాయమంటే ఏంటో తెలిస్తేగదా.

రుణాలు తీర్చలేక, సాగు చేయలేక రైతన్నల బలవన్మరణాలు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని గ్రాంటు నుంచి ఏకంగా 15 రైతు కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేసి కొందరు, తల్లిదండ్రులను ఇంటి వద్దనే ఉంచేసి మరికొందరు పొట్టచేత పట్టుకుని, పుట్టిన గడ్డను, సొంతూరిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పులను తీర్చడానికే అక్కడ కూలి పనులు చేస్తుండటం గమనార్హం. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారిలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటకల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)- 2022 నివేదిక ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. ఏపీలో 2022 సంవత్సరంలో 917 మంది రైతులు, కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 309 మంది సొంత భూములున్న పట్టాదారులు, 60 మంది కౌలుదారులు ఉన్నారు. మిగిలిన వారంతా రైతు కూలీలు. అంటే జగన్‌ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నదాతలకు జగనన్న చేసిందేమిటి? - ఇచ్చిన హామీలు నెరవేర్చారా? - What CM Jagan done for farmers

వివిధ నివేదికలు, మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికల గణాంకాల ప్రకారం 2019 జూన్‌ నుంచి 2021 వరకు 2,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగ్గా 2022 ఏప్రిల్‌ నాటికి 718 మందికే జీవో 43 ప్రకారం ఆర్థిక సాయం అందింది. పంటల పెట్టుబడి వ్యయం ఐదు సంవత్సరాలలో భారీగా పెరిగింది. 2018-19లో ఎకరం వరి పంటకు రూ.25 వేల పెట్టుబడి అవ్వగా ఇప్పుడది రూ.40 వేలకు చేరింది. మిరప రూ.లక్షన్నర నుంచి రూ.2.75 లక్షలకు పెరిగింది. దిగుబడి ఏమాత్రం పెరగడం లేదు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కడం లేదు. ఒకవేళ ధర తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు.

ఉచిత పంటల బీమా పథకం బ్రహ్మ రహస్యమే. రాష్ట్రంలో 2023 ఖరీఫ్‌లో 1.38 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే 64 లక్షల ఎకరాలకే బీమా చేశారు. మిరప రైతుల్లో అత్యధికులకు బీమానే దక్కడం లేదు. సూక్ష్మ సేద్య పథకాన్ని తొలి మూడు సంవత్సరాలలో అటకెక్కించి చివరి రెండు సంవత్సరాలు నామమాత్రంగా అమలు చేశారు. రైతుల కోసం ఉచితంగా 2లక్షల బోర్లను వేయిస్తామని జగన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ఇప్పటివరకు 25 వేలకు మించలేదు. ప్రకృతి విపత్తులు పంటల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 2023 డిసెంబరులో మిగ్‌జాం తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం ఇవ్వాలని రైతులు మొరపెట్టుకున్నా సగటున రూ.6 వేలు మాత్రమే నిర్ణయించారు. వాటికి జగన్‌ బటన్‌ నొక్కినా సాయం ఇంకా అందలేదు.

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మందాడికి చెందిన మాలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తనకున్న మూడు ఎకరాలకు తోడు పది ఎకరాలను కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేసేవారు. సంవత్సరాలుగా దిగుబడి సరిగా రాక అప్పులే మిగిలాయి. 2022 డిసెంబరులో విరుచుకుపడిన తుపాన్‌తో సమస్యలు పెరిగాయి. మొత్తం అప్పు రూ.20 లక్షలకు చేరింది. పొలం అమ్మినా రుణం తీరదనే బాధతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న పురుగుల మందు తాగారు. అధికారులు రైతు ఆత్మహత్యగా కేసు రాసుకున్నా భార్య వెంకట్రావమ్మకు పరిహారం అందలేదు. బీటెక్‌ చదివిన కుమారుడు హైదరాబాద్‌లో ఉద్యోగ వేటలో ఉన్నారు.

'కళ్ల ముందే పంట ఎండిపోతోంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో' - Farmers Facing Lack Of Irrigation

చిత్తూరు జిల్లాలోని ఆర్‌.కురవపల్లికి చెందిన సురేంద్రకు 2.67 ఎకరాల పొలం ఉంది. సాగునీటి కోసం బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అప్పటికే రూ.11 లక్షల అప్పు చేశారు. దాన్ని తీర్చే మార్గం కనిపించక 2020 జనవరి 28న ఇంట్లోనే ఉరేసుకున్నారు. అధికారులు రైతు ఆత్మహత్యగా నివేదిక ఇచ్చినా సురేంద్ర భార్య చంద్రకళకు సాయం అందించలేదు. ఇప్పుడు ఆమె కల్లూరులో పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో కూలీకి వెళుతున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహం జరగగా చిన్న కూతురు ఇంటర్‌ చదువుతోంది.

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నమశ్శివాయపురంలో అవులూరి ఏడుకొండలరెడ్డికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. నాలుగు ఎకరాల్లో దానిమ్మ, జామ తోటలు వేసి భారీగా నష్టపోయారు. మొత్తంగా రూ.15 లక్షలు అప్పు అవ్వడంతో భూమంతా అమ్మేసినా తీరలేదు. 2021 సెప్టెంబరు 15న పురుగుల మందు తాగి మరణించారు. భార్య వెంకటలక్ష్మి, కూతుళ్లు దేవిక, నీలిమలను వీధిన పడేశారు. బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆ అభాగ్యురాలు తమ పొలంలోనే కూలీగా పనిచేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం అందించలేదు.

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా బంద్- అన్నదాత నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం - Farmers Problems Due To Power Cuts

Last Updated : Apr 19, 2024, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.