Expired Medicine in Badvel Government Hospital in YSR District : వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఓ బాలుడికి కాలం చెల్లిన సిరప్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బద్వేలు పట్టణంలోని రఘునాథపురానికి చెందిన శివానంద తన నాలుగేళ్ల కుమారుడు జితేష్ కుమార్ గొంతు నొప్పితో బాధపడుతుండడంతో శనివారం (నవంబర్ 9న) ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యుడికి తెలపగా పరిశీలించి మందుల చీటీ రాసిచ్చారు. ఆసుపత్రిలోని మందులిచ్చే కేంద్రంలో సిరప్ తీసుకుని ఇంటికెళ్లిపోయారు.
ఆకాశరామన్న ఉత్తరం - వెలుగు చూసిన పిల్లల విక్రయం
బాలుడికి సిరప్ వేసిన అనంతరం ఒక్కసారిగా వాంతులు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలం చెల్లిన సిరప్ వాడడంతోనే వాంతులైనట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది డాక్టర్లు, 20 మంది నర్సులు ఉన్నా రోగులకు కాలం చెల్లిన మందులు ఇవ్వడం బాధకరమని బాలుడి తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కాలం చెల్లిన మందులు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
విధి ఆడిన వింత నాటకం - ఒకే ఆసుపత్రిలో అటు తండ్రి మరణం - ఇటు పుత్రుడి జననం
ఈ అంశంపై బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి సుబ్బారెడ్డి స్పందించారు. కాలం చెల్లిన సిరప్ తమ వైద్య సిబ్బంది ఇవ్వడం వాస్తవమేనని, విచారణ జరిపి బాధ్యులపై చర్యల నిమిత్తం వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారని వెల్లడించారు.
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital