ETV Bharat / state

ముందుగానే ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ - అయోమయంలో ఉద్యోగులు - Postal Ballot Voting - POSTAL BALLOT VOTING

Postal Ballot Voting: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌పై ఎన్నికల సంఘం గందరగోళం సృష్టిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు చేస్తూ ఉద్యోగులను అయోమయానికి గురి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.30 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల సంఘం సృష్టిస్తున్న గందరగోళం, కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది ఓటుహక్కు కోల్పోవాల్సి వస్తోంది.

Postal Ballot Voting
Postal Ballot Voting (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 8:42 AM IST

ముందుగానే ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ - అయోమయంలో ఉద్యోగులు (Etv Bharat)

Postal Ballot Voting : అధికారులు అయోమయ ఆదేశాలు, ఉద్యోగుల గందరగోళం మధ్య రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఈసీ ప్రకటించగా చాలా జిల్లాల్లో 4వ తేదీ నుంచే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అధికారులు ప్రారంభించేశారు. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు కొరవడటంతో ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో ఈ ప్రక్రియను చేపట్టడం వివాదాస్పదమవుతోంది.

మొత్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3.30 లక్షల మంది అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం చెబుతోంది. వీరిలో ఎంత మందికి ఫాం 12 జారీ చేశారు. ఎంతమందికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారన్న దానిపై ఎన్నికల సంఘం వద్దే పూర్తి స్థాయి వివరాలు లేని పరిస్థితి నెలకొంది. దురుద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల జిల్లా కలెక్టర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కొందరికే పోస్టల్‌ బ్యాలెట్లు కేటాయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ : మరోవైపు ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికల విధుల్లోకి ఓపీఓలుగా అంగన్ వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఐతే వీరెవ్వరికీ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసే ఫాం 12లను జారీ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించునే అవకాశం వీరంతా కోల్పోయినట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

అంగన్వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేలా ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు వీలుగా గడువు పొడిగించాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఎన్నికల అధికారుల నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ నేత హృదయరాజు ఆరోపించారు.

పోస్టల్ బ్యాలెట్‌ ఓటింగ్​లో గందరగోళం- ఓటు వేయకుండా కుట్రలు చేస్తున్నారన్న ఉద్యోగులు - Employees Postal Ballot Voting

టెక్కలి : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విధి నిర్వహణలో ఉన్న న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్ వట్టికూళ్ల కీర్తి కుమార్ పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గోపాలం దాడికి పాల్పడ్డాడు. దాడి సమయంలో అక్కడే ఉన్న టెక్కలి ఎస్సై లక్ష్మితో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్నికల నిబంధనలు ప్రశ్నార్థకంగా మారాయి. పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు సంచరిస్తున్నా అధికారులు వారిని వారించలేదు.

ఉద్యోగులకు నిరాశే : పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు అభ్యర్థి రామాంజనేయులు హోమ్ ఓటింగ్​లోని లోపాలపై అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కోరారు.

ఆ ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్​ ఓటు అవకాశం కల్పించాలి : కేఆర్ సూర్యనారాయణ - Employees Round Table

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో పీఓ, ఏపీఓ లకు శిక్షణ తరగతులతో పాటు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లిన పలువురు ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లపాడులో హోం ఓటింగ్‌ను తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు నిలిపేశారు. ఓటు వేసే బాక్స్‌కు సీలు లేకపోవడాన్ని గుర్తించిన ఏజెంట్లు అధికారులను నిలదీశారు. దీంతో హోం ఓటింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ వ్యవహారంపై ఆర్వో శ్రీకర్‌ విచారణ చేపట్టారు.

పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో తీవ్ర ఉద్రిక్తత - ఎన్నికల అధికారులపై మండిపడ్డ ఉద్యోగులు - Clash during postal ballot vote

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.