ED Press Note in Delhi Liquor Scam Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశామన్న ఈడీ, రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ప్రెస్‌నోట్‌లో తెలిపింది. సిసోదియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేశామన్న ఈడీ, హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు చేశామని వెల్లడించింది. సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపింది.
అక్రమంగా అరెస్టు చేసారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారని పేర్కొంది. కేజ్రీవాల్, సిసోదియాతో కలిసి కవిత కుట్ర పన్నారన్న అధికారులు, 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని, హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపారు. ఒక నేరాభియోగ పత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు.
కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం : హరీశ్‌రావు
సుప్రీంలో కవిత పిటిషన్ : ఇదిలా ఉండగా, ఈ కేసులో ఈ నెల 15న అరెస్టై, ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే, తనను అరెస్ట్ చేశారని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి, తనను అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఇవాళ ఆన్లైన్లో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం - 'అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటాం'