ETV Bharat / state

వినూత్న ఆవిష్కరణల వేదిక 'ఎలక్టిక్యూ2K24'- ఆకర్షించిన శాస్త్రసాంకేతిక నమూనాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 7:38 PM IST

ECLECTIQUE 2K24 Programme at Vizianagaram: ప్రస్తుత కాలంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో యువత ముందంజలో ఉంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో తమలోని ప్రతిభను ప్రాజెక్టుల రూపంలోకి మలుస్తున్నారు. ఎలక్టిక్యూ కార్యక్రమంలో శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు సందర్శకుల దృష్టిని ఆకర్షించాయి.

ECLECTIQUE 2K24 Programme at Vizianagaram

ECLECTIQUE 2K24 Programme at Vizianagaram: ఆధునిక యుగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడంలో యువత అగ్రశ్రేణిలో ఉన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడానికి నిత్యం కొత్త పుంతలు తొక్కుతున్నారు. తమలోని ప్రతిభా పాఠవాలను ప్రాజెక్టుల రూపంలోకి యువత మలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే వినూత్నమైన పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి యువతను ప్రోత్సహించేందుకు ఎలక్టిక్యూ 2K24 కార్యక్రమం వేదికైంది. అందులో యువత ఆవిష్కరించిన నమూనాలు ఏమిటో, అవి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వినూత్న ఆవిష్కరణల వేదిక 'ఎలక్టిక్యూ2K24'- ఆకర్షించిన శాస్త్రసాంకేతిక నమూనాలు

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

అందరిలా ఉద్యోగం చేయడం కంటే సమాజానికి ఉపయోగపడే యాప్‌లు, ప్రాజెక్టులు తయారు చేసి గుర్తింపు పొందాలనుకుంటున్నారు నేటి యువత. తమలోని ప్రతిభను వెలికితీసి అద్భుతమైన ఆవిష్కరణలను తయారు చేస్తున్నారు. అలాంటి ఆవిష్కరణలే విజయనగరంలోని జేఎన్​టీయూ విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకున్నాయి. విజయనగరంలోని గురజాడ జేఎన్​టీయూ విశ్వవిద్యాలయంలో ఎలక్టిక్యూ 2K24 పేరుతో జాతీయ సింపోజియం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు సందర్శకుల దృష్టని ఆకర్షించాయి.

ఇటీవల కాలంలో గుండెపోటు బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఒకవేళ డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఈ సమస్య వస్తే పరిస్థితి ఏంటని ఆలోచించాడీ యువకుడు. తాను రూపొందించిన స్మార్ట్ యాక్సిడెంట్ ప్రివెన్సెస్‌ సిస్టమ్‌ ద్వారా కారు అగడంతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్తుందని చెబుతున్నాడు. ఇంట్లో ఉండే లైట్‌, ఫ్యాన్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌ని వేరే చోట ఉండి కూడా ఆన్, ఆఫ్‌ చేయోచ్చంటుంది ఈ యువతి. టైమ్‌ సెట్‌ చేయడం ద్వారా వాటంతట అవే వెలగడం, బంద్‌ కావడం జరుగుతాయంటోంది. అగ్నిప్రమాక సిబ్బందికి ఉపయోగపడేలా ఫైర్‌ ఫైటింగ్ రోబోట్‌ని తయారు చేసింది ఈ అమ్మాయి. ఏఐ ఇంటెలిజెన్స్‌ సహాయంతో మొబైల్ ద్వారా ఈ రోబోట్‌ని ఆపరేట్‌ చేయోచ్చంటున్నారు.

ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్​డీ - కర్ణాటక గవర్నర్​ నుంచి పట్టా అందుకున్న యువకుడు

వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అద్భుతమైన ఆవిష్కరణను రూపొందిచాడు ఈ యువకుడు. సోలార్‌ ద్వారా పనిచేసే ఈ ప్రాజెక్టు వల్ల రైతులు తమ పనులను సులభంగా చేసుకోవచ్చని అంటున్నాడు. ఒకటో ప్లాట్‌ఫాం మీద ఉన్న ప్రయాణికుడు పదో నంబరు ప్లాట్‌ఫాం దగ్గరుకు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. వయసు పైబడిన వారైతే చాలా ఇబ్బంది పడతారు. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాడీ యువకుడు. వీటితో పాటు అగ్రి రోబో, ఫార్మింగ్ రోబో, సోలార్ రోవర్‌, స్మార్ట్ ఫే మీటర్, సోలార్‌ మూవబుల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ వంటి ప్రాజెక్టులు ఎలక్టిక్యూ 2K24 కార్యక్రమంలో ప్రదర్శించారు. యువతను ప్రోత్సహించేందుకు ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వాహిస్తామని జేఎన్​టీయూ ప్రాధానాచార్యులు చెబుతున్నారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి పరికరానికి సాంకేతికతను జోడించి రూపొందించిన ప్రాజెక్టులు రాబోవు రోజుల్లో పెను మార్పులు తీసుకురానున్నాయి.

వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.