ETV Bharat / state

శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం ? అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా - Dasara Celebration Arrangements - DASARA CELEBRATION ARRANGEMENTS

Dasara Celebration Arrangements 2024 at Indrakeeladri : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ దసరా. ఈ ఉత్సవంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని రోజుకో రూపంలో కొలుస్తారు భక్తులు. భక్తి శ్రద్దలో శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగగా ప్రతీతి.

Dasara Celebration Arrangements 2024
Dasara Celebration Arrangements 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 1:45 PM IST

Devi Navaratri Ammavari Alankaram : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. విజయదశమి పర్వదినాన జగన్మాత దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్దం చేసి అతడ్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో వేడుకగా దసరా ఉత్సవాలు చేసుకుంటారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అక్టోబర్​ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో జిల్లా కలెక్టర్​ డా. జి. సృజనసమావేశం నిర్వహించారు. సామాన్య భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లుకు తావు లేకుండా చూడాలి. అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.

తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.

మొదటి రోజు (అక్టోబర్‌ 3) : కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరిగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (రెండో రోజు) దర్శనమిస్తారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారంగా బాలా త్రిపుర సుందరీదేవి ప్రతీతి.

రెండో రోజు (అక్టోబర్‌ 4) : ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు అమ్మవారు గాయత్రిదేవిగా దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని కొలుస్తే గాయత్రి సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం

మూడో రోజు (అక్టోబర్​5) : ఆశ్వయుజ శుద్ధ తదియ ఉదయం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నం ప్రసాదించే మాతృమూర్తిగా దేవిని కొలిచి నైవేద్యాలు సమర్పిస్తారు. సర్వజీవనాధారమైన అన్నం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని కొలవడంతో వారికి మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

నాలుగో రోజు (అక్టోబర్​6) : ఆశ్వయుజ శుద్ధ చవితి దుర్గామాత శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తులతో పూజలందుకుంటారు.

ఐదోరోజు (అక్టోబర్​ 7) : ఆశ్వయుజ శుద్ధ పంచమిన శ్రీ మహాచండి దేవి అలంకారంలో దేవి దర్శించుకోవడానికి భక్తులు ఎదురుచూస్తారు. ఈ స్వరూపం మహాదేవి మరొక శక్తివంతమైన రూపం. అమ్మవారు చెడును నాశనం చేయడానికి ఈ రూపంలో వస్తారని ప్రజల నమ్మకం.

ఆరో రోజు (అక్టోబర్ 8) : ఆశ్వయుజ శుద్ధ షష్టిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవతగా ఈ మహాలక్ష్మి అవతారంలోని అమ్మవారిని కొలుస్తారు. లోక స్థితికారిణిగా, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.

ఏడో రోజు (అక్టోబర్ 9): ఆశ్వయుజ శుద్ధ సప్తమి అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలలో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవికి శరన్నవరాత్ర ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతిదేవిని సేవించడం వల్ల విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహం వల్ల సర్వ విద్యల్లో విజయం పొందుతారు.

ఎనిమిదో రోజు అక్టోబర్​ (అక్టోబర్10) : ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిధి నాడు కనకదుర్గమ్మ వారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలోని అమ్మవారిని శక్తి స్వరూపినిగా కొలుస్తారు భక్కలు. కుంకుమార్చనలతో మొక్కులు చెల్లుంచుకుంటారు.

తొమ్మిదో రోజు (అక్టోబర్ 11) : ఆశ్వయుజ శుద్ధ నవమిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దుర్గాదేవి దేవతల, బుుషులు, మానవుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు.

పదో రోజు (అక్టోబర్12) : ఆశ్వయుజ శుద్ధ దశమిన కనకదుర్గాదేవి చిరునవ్వులతో రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయి.

Dussehra Sharannavaratri Celebrations: వైభవంగా దసరా ఉత్సవాలు.. విజయనగరం జిల్లాలో ఆకట్టుకున్న వేడుకలు

Dussehra Celebrations on Indrakiladri From October 3 : ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్యూలైన్‌లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జి. సృజన తెలిపారు.

దసరా ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాధి మంది అమ్మవారి దర్శనానికి తరలివస్తారని పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆదాయం 16.71 కోట్లు - ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం వల్ల కాస్త తగ్గిందన్న ఈవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.