ETV Bharat / state

గుక్కెడు నీటికి అలమటిస్తున్న ఎస్సీ కాలనీలు- పట్టించుకోండి మహాప్రభో!

Drinking Water Problem in SC Colonies: ప్రసంగం మొదలు పెడితే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ రాగాలు తీస్తుంటారు. అయితే గుక్కెడు మంచినీళ్ల కోసం ఎస్సీ కాలనీలు నిత్యం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 1:19 PM IST

Drinking_Water_Problem_in_SC_Colonies
Drinking_Water_Problem_in_SC_Colonies
గుక్కెడు నీటికి అలమటిస్తున్న ఎస్సీ కాలనీలు- పట్టించుకోండి మహాప్రభో!

Drinking Water Problem in SC Colonies: కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలను తీవ్రంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని నిడుమోలు, మల్లేశ్వరం, వీరాయిలంక, అవురుపూడి ఎస్సీ కాలనీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.

ఏడు వేల జనాభా ఉన్న నిడుమోలులో మంచి నీటి కోసం రోజూ యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఐదేళ్ల కింద ఐలూరు సీపీడబ్ల్యూఎస్​(CPWS) పథకం నుంచి తాగునీటి పైప్‌లైన్‌ వేసి గ్రామంలో నాలుగు కళాయిలు బిగించారు. నాలుగైదు రోజులకు ఒకసారిగానీ నీళ్లు రావడం లేదు. తాగునీటి సమస్య తీర్చాలని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరం చూడపడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

రోడ్డెక్కిన వైసీపీ కార్పొరేటర్లు- తాగునీటి సమస్య తీర్చాలంటూ అధికారుల ఘెరావ్

జల్‌ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కింద నిడుమోలులో వాటర్ పైప్ లైన్లు వేసి నల్లాలైతే బిగించారు. కానీ ట్యాంక్‌కు అనుసంధానం చేయకుండా విడిచిపెట్టారు. దీంతో చేసేదేమీ లేక డబ్బులు చెల్లించి డబ్బా నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్సీవాడలో తాగునీటి సమస్య పరిష్కరించడంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదని స్థానికులు అంటున్నారు.

నిడుమోలు శివారు వీరాయిలంకలో రక్షిత నీటి పథకం ఉన్నా ఆ నీరు ఉప్పగా ఉండడంతో తాగడానికి పనికి రావడం లేదు. ఇటీవల ఐలూరు సీపీడబ్ల్యూఎస్​ పథకం నుంచి గ్రామ శివారు వరకూ పైపులైన్ వేసి కాల్వగట్టున ఒక కుళాయి బిగించారు. నీరు వచ్చిన సమయంలో పట్టుకోకపోతే ఇక అంతే సంగతి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో తమ గతి ఏమవుతుందోనని ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌ ఇకనైనా మొద్దనిద్ర వీడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గుంటూరులో దాహం కేకలు, అధికారుల చర్యలపై ప్రజల ఆగ్రహం

"చాలా కాలం నుంచి మా ఎస్సీ కాలనీల్లో తాగునీటి ఎద్దడి సమస్య ఉంది. గుక్కెడు మంచినీళ్ల కోసం మేము ప్రతిరోజూ పోరాటం చేయాల్సి వస్తోంది. ఐదేళ్ల కింద ఐలూరు సీపీడబ్ల్యూఎస్​ పథకం ద్వారా తాగునీటి పైప్‌లైన్‌ వేసి గ్రామంలో కేవలం నాలుగు కళాయిలు మాత్రమే బిగించారు. నాలుగైదు రోజులకు ఒకసారిగానీ నీళ్లు రావడం లేదు. కుళాయిలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు రావో తెలియట్లేదు. దీంతో మేము పనులు మానుకుని తాగునీరు కోసం వేచి ఉండాల్సి వస్తోంది. దీనిపై ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - బాధితులు

తాగునీటి ఇక్కట్లు - గంటల తరబడి పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.