vro vra fight: కృష్ణా జిల్లా, ఘంటసాలపాలెంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్ఓ) నాగ మల్లీశ్వరి, గ్రామ రెవెన్యూ సహాయకురాలు (వీఆర్ఏ) మౌనికకు మధ్య గత 12 నెలలుగా పాస్ పుస్తకాల మంజూరు, ఇతర ధ్రువీకరణ ప్రత్రాల నివేదికలు రాయడంలో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. గ్రామ రెవెన్యూ సహాకురాలు మౌనిక గ్రామ రెవెన్యూ అధికారి మల్లీశ్వరి కుమారుడు శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. తాజాగా మంగళవారం బందరు ఆర్డీఓ కార్యాలయం నుంచి రిజిస్టరు పోస్టు వచ్చింది. మల్లీశ్వరి బందరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సరెండర్ కావాలని పోస్టు ద్వారా ఉత్తర్వులు అందాయి. దీంతో మల్లీశ్వరి ఎమ్మార్వో ఎన్.బి.విజయలక్ష్మి గదిలోకి వెళ్లి లోపల ఉండి గడియపెట్టింది. కొద్దిసేపటి తర్వాత గది బయటకు వచ్చి తలుపులకు గడియ వేసి అక్కడే బైటాయించింది.
తహసీల్దార్ మందలింపు - సర్వేయర్ ఆత్మహత్యాయత్నం
ఈ క్రమంలో మల్లీశ్వరితో పాటు ఆమె కుమారుడు శ్రీనివాస్ తెచ్చిన కొద్ది పాటి పెట్రోల్ కార్యాలయం గోడలపై చల్లడంతో అక్కడ ఉన్న సిబ్బంది ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. ఉన్నతాధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని మల్లీశ్వరి డిమాండ్ చేశారు. తహసీల్దార్ వెంటనే కార్యాలయం పక్కనే ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి గది తలుపులు తెరిచారు. ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
భూవివాదం - మహిళా రైతు Vs రెవెన్యూ సిబ్బంది
మంత్రుల పర్యటనకయ్యే ఖర్చుల కోసమే లంచాలు - తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు