YOUNG PISTOL SHOOTER IN VIZAG: ఆ అమ్మాయి పిస్టల్ ఎక్కుపెడితే లక్ష్యం చేధించాల్సిందే. కృషి, పట్టుదల, ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోందా యువతి. చిన్నతనం నుంచి ఆటల్లో శిక్షణ లేకపోయినా 3 ఏళ్ల కఠోర శ్రమతో మెుదటి పిస్టల్ షూటింగ్‌లోనే జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. మను బాకర్ తరహాలో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఆ యువ కెరటం. ఆ చిచ్చరపిడుగే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన యువతి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పారాలింపిక్స్‌లో భారత్ బోణీ - ఒకేరోజు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ - Paralympics India 2024
నేపథ్యం: అమ్మాయి పేరు దీక్షిత ప్రియ. విశాఖ గోపాలపట్నం ఆళ్వార్ దాస్ జూనియర్ కళాశాలో ఇంటర్ చదువుతోంది. మామయ్య సూచనలతో మూడేళ్ల క్రితం పిస్టల్ పోటీలకు సాధన చేసింది. అదే తనకు జాతీయస్థాయిలో పేరు తీసుకొచ్చింది. చదువులో సైతం రాణిస్తోంది. అద్భుతమైన ప్రతిభతో ఒలింపిక్స్ వైపు అడుగులు వేస్తోంది ఈ యువ షూటర్. పిస్టల్ షూటింగ్ రంగంలో తన ప్రతిభ గుర్తించిన తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం అందుకు తగిన సహకారం అందిస్తున్నారని ఈమె చెబుతోంది. భవిష్యత్తు లక్ష్యాలు అధిగమించేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతుంది దీక్షిత ప్రియ. ఈ యువ షూటర్ ఒలింపిక్స్ పోటీలకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆ 5 రికార్డులను బ్రేక్ చేయడం విరాట్‌కు సాధ్యమేనా? - Sachin Virat Record Comparison
''క్రీడల్లో తల్లిదండ్రులు, కళాశాల పేరు నిలబెట్టడం గర్వంగా ఉంది. ఆమె భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం'' - మాధవి, దీక్షిత ప్రియ తల్లి
''క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ విద్యాసంస్థలు ముందుంటాయి. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను చూసి మరికొంతమంది వచ్చేందుకు సహాయపడుతుంది. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించేందుకు తమ ప్రోత్సాహం ఎలప్పుడూ ఉంటుంది'' - కళాశాల యాజమాన్యం