ETV Bharat / state

'తండ్రి చూస్తుండగానే చిన్నారిని చిదిమేసిన స్కూల్​ బస్'- 'ఆడుకుంటూ రోడ్డెక్కిన బాలుడు అక్కడికక్కడే' - Accidents in AP - ACCIDENTS IN AP

Different Accidents Two Children Dead in AP: విశాఖ జిల్లాలో స్కూల్‌ బస్సు ఢీకొని ఓ చిన్నారి మృతి చెందింది. కళ్లముందే కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. పల్నాడు జిల్లాలో ఆడుకుంటూ బయటకు వచ్చిన బాలుడిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Different Accidents Two Children Dead
Different Accidents Two Children Dead (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 10:18 AM IST

Updated : Aug 11, 2024, 10:27 AM IST

Different Accidents Two Children Dead in AP: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు దు:ఖంలో మునిగిపోయారు. విశాఖ జిల్లాలో స్కూల్​కు వెళ్లిన చిన్నారి మృతువాత పడటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పల్నాడు జిల్లాలో ఆడుకుంటూ ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చిన బాలుడిని కారు ఢీకొనడంతో తల్లిదండ్రులు కంటతడి పెట్టారు.

Child Dead being Hit By Bus in Visakha District: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం మజ్జిపేటలో ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌ బస్సు ఢీకొని మూడు సంవత్సరాల వయసు గల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన బంటుపల్లి సురేష్‌కు ఇద్దరు కుమార్తెలు. సురేశ్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. చిన్న కుమార్తె ఆద్య పద్మనాభం మండలం రెడ్డిపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్​కేజీ చదువుతోంది. ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటల సమయంలో కుమార్తె కోసం గ్రామంలోని రోడ్డుపై బస్సు ఆగే చోట తండ్రి సురేశ్‌ వేచి ఉన్నారు.

బస్సు దిగిన చిన్నారి రోడ్డుకు అవతల ఉన్న తండ్రిని చూసి సంతోషంగా పరుగు తీసింది. ఇంతలో అదే స్కూల్‌ బస్సు ముందుకు కదిలి ఆద్యని బలంగా ఢీకొట్టింది. అంతే ఆద్య విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ సూరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బాపట్లలో కారును తప్పించబోయి ఆటో బోల్తా - విద్యార్థులకు స్వల్ప గాయాలు - Students Auto Overturned

Boy Dead Being Hit by Car in PAlnadu District: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయిపాలెం వద్ద విషాదం జరిగింది. కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసు గల ఈర్ల లక్ష్మీ చరణ్‌ సాయి ఆడుకుంటూ ఒక్క సారిగా రోడ్డు మీదకి వచ్చాడు. కోటప్పకొండ నుంచి వస్తున్న ఓ కారు సాయిని ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే బాలుడు మరణించాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కారును ఓ మహిళా లాయర్‌ డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం.

'రోడ్డే' ప్రాణం తీసింది - ఏడేళ్ల బాలుడు మృతి- స్థానికుల ధర్నా - Road Accident in Vizianagaram

Last Updated : Aug 11, 2024, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.