![వారాహి దీక్షలోకి పవన్ కల్యాణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/img-20240625-wa0007_2506newsroom_1719297245_1011.jpg)
Deputy CM Pawan Kalyan Varahi Ammavari Deeksha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. దైవ భక్తి మెండుగా ఉన్న పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికలలో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది.
![జనసేన నేతలతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/img-20240625-wa0004_2506newsroom_1719297245_465.jpg)
తెలుగుదేశం పార్టీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో 2 లోక్ సభ స్ధానాలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల నుంచీ విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలక శాఖల బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.
![అమ్మవారి దుస్తుల్లో పవన్ కల్యాణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/img-20240625-wa0003_2506newsroom_1719297245_277.jpg)
ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటించారు. ఈ దీక్షలో పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. నేటి నుంచి పవన్ ఈ దీక్ష పాటించారు. గత ఏడాది జూన్ లో కూడా పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించిన సంగతి తెలిసిందే.