Deputy CM Narayanaswamy: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూతురి గెలుపు కోసం అపసోపాలు పడుతున్నారు. పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో తన స్థానంలో కూతురు కృపాలక్ష్మిని పోటీలో నిలిపినా, పరిస్థితిలో మార్పు రాలేదు. వరుసగా రెండోసారి గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారాయణస్వామి, అధికార దర్పంతో పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. పార్టీ శ్రేణులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడతో నారాయణస్వామి స్థానంలో ఆయన కూతరు కృసాలక్ష్మికి అధిష్టానం అవకాశం కల్పించింది. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ శ్రేణులో నారాయణస్వామి కుటుంబంపై అసంతృప్తితో ఎదురీదుతున్న నారాయణస్వామికి కాంగ్రెస్ పార్టీ రూపంలో మరో అవాంతరం ఏర్పడింది.
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఏటికి ఎదురీదుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి, విభజన తర్వాత వైసీపీకి పెట్టని కోటగా ఉన్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన నారాయణస్వామి పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత మూటకట్టుకొన్నారు. దీంతో నారాయణస్వామి స్థానంలో ఆయన కూతరు కృపాలక్ష్మికి అధిష్టానం అవకాశం కల్పించింది. అభ్యర్థిని మార్చినా, నారాయణస్వామి కుటుంబ సభ్యులనే బరిలో నిలపడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి తగ్గలేదు. ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేకత ఓ వైపు మరో వైపు నారాయణస్వామికి దశాబ్ధకాలంగా వెన్నంటి ఉన్న మేనల్లుడు రమేష్ వైసీపీకి దూరమయ్యారు. రమేష్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటంతో అధికార వైసీపీ ఓట్లు మరింత చీలిపోయే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 సంవత్సరంలో వేపంజేరి నియోజకవర్గం స్థానంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏర్పడింది. పునర్విభజనకు ముందు వేపంజేరి, పునర్విభజన తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కుతూహలమ్మ విజయం సాధించగా, రాష్ట్ర విభజనానంతర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో కాంగ్రస్ శ్రేణులు వైసీపీ వైపు మళ్లాయి. దీంతో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నారాయణస్వామి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన నారాయణస్వామి జగన్ మంత్రివర్గంలో స్థానం పొందారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా, తన వ్యవహారశైలితో కార్యకర్తలకు దూరమయ్యారు. ఫలితంగా నారాయణస్వామి స్థానంలో ఆయన కూతురు కృపాలక్ష్మికి అధిష్టానం అవకాశం కల్పించింది. .
ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాక నారాయణస్వామి నియోజకవర్గ అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా, పార్టీ శ్రేణులను సంతృప్తిపరచలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా వ్యతిరేకతకు తోడు, దశాబ్ధకాలంగా తన వెంటే ఉంటూ విజయంలో సర్వంతానై వ్యవహరించిన మేనల్లుడు దూరం అవడంతో నారాయణస్వామి కూతురి విజయం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.