Delhi Court Judgment on Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ (మే 6వ తేదీ) విచారణ చేపట్టిన కోర్టు తాజాగా ఈ విధంగా తీర్పునిచ్చింది. ప్రస్తుతం కవిత తిహాడ్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని కవిత బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Kavitha Bail Petition Denied : ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు. అరెస్టుకు సరైన కారణాలు లేవని వివరించారు. మరోవైపు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆమె బయటకు వెళ్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. మద్యం కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానానికి తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవకు బెయిల్.. 'షరతులు వర్తిస్తాయి'