MLC Kavitha Bail Denied in Delhi Liquor Scam : మూడు నెలలుగా తిహాడ్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ దిల్లీ ధర్మాసనం తీర్పునిచ్చింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేయగా, ఈమేరకు దిల్లీ కోర్టు తీర్పునిచ్చింది.
కవితకు మరోసారి చుక్కెదురు - బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు - MLC Kavitha Bail Update
MLC Kavitha Bail Update : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 5:32 PM IST