Crows Unity in Razole : మనిషి వికృత ప్రవర్తన ఈరోజుతో కాకులకు అర్థమైంది అనుకుంటా. ఈ సన్నివేశాన్ని చూసిన మూగజీవాలకు మానవులతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాయామో. "అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకునే మానవుల చేష్టలు ఈ రోజు మరోసారి బయటపడ్డాయి. అందుకు నిదర్శనమే ఈ సంఘటన.
"మన పెద్దల పిండాన్ని కాకులు ముట్టుకోవాలని, తినాలని "కావ్.. కావ్" అంటూ అరుస్తూ బతిమాలుతాం. అదే మనం అవసరం తీరాకా.. అదే కాకి ఆకలితో మనం ఇంటి గుమ్మం తొక్కితే దీనికి చావు ఎప్పుడు వస్తుందో అని శాపనార్థాలు పెడతాం." ఈ చికెన్ షాప్ యజమాని నాలుగు ఆకులు ఎక్కువ చదువుకొని కాకి కాళ్లకు తాడు కట్టి వికృత ఆనందాన్ని పొందాడు. తనతో పాటు ఉంటే కాకి మృతి చెందితేనే గొల చేసే కాకులు అతనికి సరైన గుణపాఠం చెప్పాయి. ఐకమత్యమే మహా బలమని ప్రజలకు ఓ మేసేజ్ ఇచ్చాయి. అసలేం జరిగిందంటే..
కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?
Chicken Shop Owner Tied to Crow With Rope : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఓ యజమాని చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆకలితో ఉన్న కాకులు షాప్‌లోని వ్యర్థాలను, చికెన్ ముక్కలను ఎత్తుకుపోతున్నాయి. ప్రతిరోజూ ఇలాగే జరగడంతో ఎలాగైనా కాకులను తన షాప్ దరిదాపుల్లోకి రాకుండా చేయాలని పన్నాగం పన్నాడు. ఇదే తరుణంలో మెదడుకు పదును పెట్టడం వల్ల రాక్షస ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా దానికి ఆచరణలో పెట్టాడు. కాకి షాపు దగ్గరకు రావటంతోనే మాటువేసి పట్టుకున్నాడు. ఈ సారి ఏ కాకి చికిన్ ముక్కలు ఎత్తుకెళ్లకుండా ఉండేందుకు కాకిని బంధించి ప్రదర్శన చేయించాడు.
తెలుపు రంగు కాకిని ఎప్పుడైనా చూశారా?
ఈ విషాద సన్నివేశాన్ని చూసిన తోటి కాకి చలించిపోయింది. వెంటనే ఆలోచించకుండా తన సైన్యాన్ని సంఘటనా స్థలానికి తీసుకుని వచ్చింది. తక్షణమే వందల సంఖ్యలో కాకులు అక్కడకు చేరుకున్నాయి. ఆకాశంలో విహరిస్తూ పెద్దగా "కావ్.. కవ్" అంటూ తమ గోడును ఆ ప్రదేశానికి తెలియజేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తమ స్నేహితుడి కట్టేసిన చికెన్ షాపు యజమానిపై యుద్ధం ప్రకటించాయి. కాకులు అరుపులకు విసుగు చెందిన ప్రజలు చికెన్ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చేసేదేమీ లేక కాకికి స్వేచ్ఛను ప్రకటించారు. అంతే కాకులన్నీ పట్టలేని ఆనందంతో మనుషులకు దూరంగా వెళ్లిపోయాయి. ఈ సీనంతా చూసిన ప్రజలు కాకులకు ఉన్నంత ఐక్యత మనకు లేకపోయే అనుకుంటూ వెళ్లిపోయారు.
మొన్న 'బలగం'.. ఇప్పుడు 'విరూపాక్ష'.. బాక్సాఫీస్ వద్ద 'కాకి' కాసుల వర్షం!