Collector Shan Mohan on PDS Rice Smuggling: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్ట్‌ను సందర్శించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా షిప్ ద్వారా పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారనే సమాచారంతో గత నెల 29న పవన్ కల్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధికారులతో కలిసి షిప్‌ను పరిశీలించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. నవంబరు 29న పవన్ కల్యాణ్ షిప్‌ను పరిశీలించిన తర్వాత అధికారులు 5 విభాగాలుగా ఏర్పడి సుమారు 12 గంటల పాటు షిప్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించారని అన్నారు. షిప్‌లో దాదాపు 4000 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వాటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధరించినట్లు తెలిపారు. ఈ షిప్ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని అన్నారు. వారు బియ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
ఇక జెట్ స్పీడ్‌లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం
ఒక్క గ్రాము కూడా దేశం దాటి వెళ్లదు: 1,320 టన్నుల బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12,000 టన్నులు ఉన్నాయని వాటిలో పీడీఎస్ బియ్యం ఉన్నాయో లేవో నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తామని అన్నారు. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్‌సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పీడీఎస్ బియ్యం ఒక్క గ్రాము కూడా దేశం దాటి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్టెల్లా షిప్‌ను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నిజాయతీగా బియ్యం వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యాపారులు, కూలీలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు.
'ఈటీవీ భారత్' కథనానికి పవన్ కల్యాణ్ స్పందన - యువరైతు నవీన్‌తో భేటీ!
హాస్టల్‌లో చేర్పిస్తారనే భయంతో కిడ్నాప్ డ్రామా - విస్తుపోయిన పోలీసులు