ETV Bharat / state

రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి - Revanth Paid Tributes to Ramoji Rao - REVANTH PAID TRIBUTES TO RAMOJI RAO

CM Revanth Paid Tributes to Ramoji Rao : రామోజీ గ్రూప్ అధినేత, స్వర్గీయ రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్షర యోధుడు రామోజీ రావు లేని లోటు, ఎవరు భర్తీచేలేరని ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని గుండె నిబ్బరంతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

CM Revanth Paid Tributes to Ramoji Rao
CM Revanth Paid Tributes to Ramoji Rao (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 9:46 PM IST

Updated : Jun 11, 2024, 10:23 PM IST

CM Revanth Reddy Visit Ramoji family Members : రామోజీ గ్రూప్ ఛైర్మన్‌, దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన రామోజీరావు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆరోజు సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో ఉండటంతో అక్షరయోధుని పార్థివదేహానికి నివాళులర్పించలేకపోయారు.

రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుసుధన్ రెడ్డిలు రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. రామోజీ గ్రూప్ ఛైర్మన్‌ రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.

మా తాత చెప్పిన పాఠాలన్నీ నా భవిష్యత్తుకు పునాదులే : రామోజీరావు మనవరాలు సహరి - Ramoji Rao Granddaughters interview

రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ - ఆయనకు ప్రత్యామ్నాయం లేదు : రామోజీరావుతో తనకు ఉన్న అనుంబంధాన్ని ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు. రామోజీరావు ( Ramoji Rao) వ్యక్తి కాదు, వ్యవస్థ అని, ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాంక్షించారు. రామోజీరావు ఆలోచనా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అనంతరం తన ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాలను పంచుకున్నారు.

"రామోజీరావు ఒక వ్యక్తి కాదు సంస్థ. ప్రజాసమస్యల పట్ల వారు కానీ ఈనాడు సంస్థలు కానీ ఎప్పుడూ ప్రతిపక్షపాత్రనే పోషించాయి. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షపాత్ర పోషించే నాయకుడు నేలకు ఒరిగారు. ప్రజలకు తీరని నష్టం ఆయన మరణం. రామోజీరావు చూపించిన మార్గంలోనే వారి కుటుంబసభ్యులు, వారి సంస్థలు ప్రజల తరఫున నిలబడతాయని ఆశిస్తున్నాను. వారిపట్ల నాకున్న ప్రత్యేక పరిచయం కానీ, ఏ సందర్భం వచ్చినా ఆయనను కలిసి సూచనలు తీసుకోవటం, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి." -రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

Tripura Governor Indrasena Reddy Tributes to Ramoji Rao : దివంగత రామోజీరావుకు త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటిలోని ఆయన నివాసానికి ప్రత్యేకంగా వచ్చిన ఇంద్రసేనారెడ్డి, రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం గతంలో రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.రు.

రామోజీరావు పార్ధివదేహానికి చంద్రబాబు నివాళి - Tribute to Ramoji Rao

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (ETV Bharat)

Last Updated : Jun 11, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.