ETV Bharat / state

ఉచిత గ్యాస్ పథకం - పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసిన సీఎం - FREE GAS SCHEME CHEQUE

దీపావళి కానుకగా ఉచిత సిలిండర్ల పథకం - రూ.2,684 కోట్ల వ్యయానికి క్యాబినెట్ ఆమోదం

free_gas_scheme_in_ap
free_gas_scheme_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2024, 3:35 PM IST

CM CBN Sanctioned Funds for Free Cylinders Scheme: సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మొదటి ఉచిత సిలిండర్​కు అయ్యే ఖర్చు రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్​కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది.

ఇవి ఉంటే చాలు ఫ్రీ గ్యాస్ మీ ఇంటికే

కేంద్రం ఇచ్చే 25 రూపాయల రాయితీ పోను మిగిలిన 876 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్​తో పాటు దీపం పథకం లబ్దిదారులు బాలమ్మ, భవానీ, మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Free Gas Eligibility: సూపర్ 6​లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన అర్హతలను వెల్లడించారు. కేవలం ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఏపీలో దాదాపు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.

"ఫ్రీ గ్యాస్ సిలిండర్" - అర్హులకు నేరుగా బ్యాంకు ఖాతాకే డబ్బులు

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం చర్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.