CM Chandrababu met Governor Abdul Nazeer : సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల పరిస్థితిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాన్ని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. అలాగే గత 8 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలపై గవర్నర్‌కు వివరించారు.
విజయవాడ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది : సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలను అబ్దుల్ నజీర్ అభినందిన్నట్లు సమాచారం. అతి త్వరలో రాష్ట్రం, విజయవాడ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
నిమ్మల రామానాయుడుకు చంద్రబాబు సూచనలు : పొంగి ప్రవహిస్తున్న పులివాగుతో బుడమేరు నీటి ఉధృతి పెరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పెరిగిన నీటి ఉధృతికి అనుగుణంగా బుడమేరు గండ్ల గట్టులను ఎత్తు పెంచే పనులను రాత్రి వర్షంలో సైతం మంత్రి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గుడ్ జాబ్ రామానాయుడు అంటూ సీఎం అభినందించారని మంత్రి గుర్తు చేసుకున్నారు. అధికారులు, మంత్రుల సమావేశంలో మంత్రి రామానాయుడును ముఖ్యమంత్రి అభినందించారని అన్నారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు, మంత్రికి అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారని మంత్రి అన్నారు. బుడమేరు గట్టును పూర్తి స్థాయిలో ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని, మరింత వరద వచ్చే అవకాశం ఉందని, మరో రెండు రోజులు అలెర్ట్‌గా ఉండాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు.