ETV Bharat / state

పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి - హోంశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు - CM Review on Home Department - CM REVIEW ON HOME DEPARTMENT

CM Chandrababu Review on Home Department: హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46.8 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు.

cm_review_on_home_department
cm_review_on_home_department (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 3:29 PM IST

Updated : Aug 21, 2024, 9:11 PM IST

CM Chandrababu Review on Home Department: 2014 - 19తో పోల్చితే 2019 - 24 మధ్య రాష్ట్రంలో క్రైమ్ రేటు 46.8 శాతం పెరిగిందని హోంశాఖ అధికారులు సీఎం చంద్రబాబుకి నివేదించారు. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై నేరాలు 152 శాతం, మిస్సింగ్ కేసులు 84 శాతం, సైబర్ క్రైం 134 శాతం ఎక్కువైనట్లు వివరించారు. హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో గంజాయితోపాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయడం, సైబర్ క్రైమ్‌కు అడ్డుకట్ట వేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడంలో టెక్నాలజీ వినియోగం, పోలీసు శాఖ బలోపేతంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలన్నారు. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వస్తానని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి. రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్ తరిమేయాలని ఆదేశించారు. ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టను మళ్లీ నిలబెడదాం - ప్రజల భద్రతకు భరోసా ఇద్దామన్నారు.

Home Minister Anita comments: గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. వైఎస్సార్​సీపీ హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగాలేదని మండిపడ్డారు. మహిళల భద్రత గురించి వైఎస్సార్​సీపీ నేతలు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో దాదాపు 15వేల సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కొన్ని పని చేయట్లేదని మంత్రి అనిత తెలిపారు.

ఓటుకు నోటు కేసు: రాజకీయ కక్షలుంటే బయట చూసుకోండి - ఆళ్ల పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం - SC ON VOTE FOR NOTE CASE

చాలా చోట్ల సీసీ కెమెరాలు లేక నేరాలు జరుగుతున్నాయని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి అనిత తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. నేరస్థులు తప్పించుకోకుండా చూడాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పెండింగ్‌ బిల్లులు రూ.11 కోట్లు క్లియర్‌ చేయాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. పోలీసు శాఖలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అనుమతించారని హోం మంత్రి తెలిపారు.

వైసీపీ హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేదు అంతే కాకుండా సీసీ కెమెరాల బిల్లులు కూడా ఇవ్వలేదు. పెండింగ్‌ బిల్లులు రూ.11 కోట్లు క్లియర్‌ చేయాలని సీఎం చంద్రాబాబు ఆదేశించారు. గతంలో దాదాపు 15 వేల సీసీ కెమెరాలు ఉండేవి అందులో కొన్ని పనిచేయట్లేదు. చాలాచోట్ల సీసీ కెమెరాలు లేకనే నేరాలు పెరుగుతున్నాయి.- అనిత, హోం మంత్రి

'టీడీపీ గెలిస్తే కొవ్వు పెరిగిందా?' - హెడ్​ కానిస్టేబుల్​ దూషించాడని మహిళల ఆవేదన - Head Constable Abused Women

వీఆర్​ఎస్​ వద్దు - సర్వీసులోకి తీసుకోండి - ప్రవీణ్​ ప్రకాష్​కు దక్కని అపాయింట్​మెంట్​ - IAS Praveen Prakash

Last Updated : Aug 21, 2024, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.