Fish Prasadam Distribution Dates 2024 : మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే నెల 8 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దీనిని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
Chepa Mandu 2024 Dates : ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని అమర్‌నాథ్ గౌడ్ తెలిపారు. జూన్ 8న మృగశిర ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తుందని అప్పటి నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాల అనంతరం జూన్ 7న దూద్‌బౌలిలో దీనిని తయారు చేస్తామని బత్తిని అమర్‌నాథ్ గౌడ్ వివరించారు. భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు బత్తిని అమర్‌నాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్ ! - KACHIDI FISH COST 4 LAKH RUPEES
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని అందిస్తున్నామని బత్తిని అమర్‌నాథ్ గౌడ్ చెప్పారు. ఇందుకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో, వైద్య సహాయం, భోజన సౌకర్యం, త్రాగు నీరు వంటి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసిన విధంగానే, ఈ సర్కార్ సైతం తగిన సౌకర్యాలు కల్పించామని కోరుతున్నామని బత్తిని అమర్‌నాథ్ గౌడ్ అన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్‌లో రోగులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లు సేవలు అందిస్తారని బత్తిని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
"జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9 ఉదయం 11 వరకు చేప ప్రసాదం పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీచేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం." - బత్తిని అమర్‌నాథ్ గౌడ్, చేప ప్రసాదం పంపిణీదారుడు
170 ఏళ్ల నాటి చరిత్ర - ఈ చేప ప్రసాదం : సుమారు 170 సంవత్సరాల నుంచి బత్తిన వంశస్థులు అస్తమా రోగులకు హైదరాబాద్‌లో ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అప్పట్లో పాతబస్తీలో పంపిణీ చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మార్చారు. కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్‌లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి, చేప పిల్లలను కొనుక్కుంటే సరిపోతుంది.
మండుటెండల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా పొందూరు నేత చీర - చేపముల్లే ప్రత్యేకం - Ponduru Khadi Sarees