ETV Bharat / state

అమెరికా 'యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌' కార్యక్రమానికి రాష్ట్ర విద్యార్థిని - సాయం చేసిన చంద్రబాబు - CBN And Lokesh Help For Girl

Girls Selected For US Youth Exchange Program: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది జంగారెడ్డి గూడెంకు చెందిన విద్యార్థి. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్‌ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు అర్హత సాధించారు. దీంతో సీఎం చంద్రబాబు తన కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటును ఇస్తుందని భరోసానిచ్చారు.

CM Chandrababu Help For Girl
CM Chandrababu Help For Girl (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 12:54 PM IST

యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమానికి విద్యార్థి ఎంపిక - సహాయం చేసిన చంద్రబాబు (ETV Bharat)

Chandrababu Help For US Youth Exchange Selected Girl: ప్రతిభకు పేదరికమనేది అడ్డుకాదని ఓ విద్యార్థి నిరూపించారు. చిన్ననాటి నుంచి చదువులో మెరిట్ సాధించిన తనను విదేశీ విద్య వరించింది. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్‌ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్య తేజశ్రీ అర్హత సాధించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిని తమ కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటును ఇస్తుందని భరోసా ఇచ్చారు.

పత్రిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన అమ్మాయి: అమెరికాలో నిర్వహించనున్న యూత్ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌కు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన బందెల సూర్యతేజశ్రీ ఎంపికయ్యారు. అంబేడ్కర్ గురుకుల ఐఐటీ, మెడికల్ అకాడమీలో సూర్యతేజశ్రీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ కార్యక్రమానికి భారత దేశం నంచి 30 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో మన రాష్ట్రం నుంచి ఇద్దరు అర్హత పొందారు. వారిలో సూర్యతేజశ్రీ ఒకరు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సూర్యతేజశ్రీ చిన్నప్పటి నుంచి చదువులో ఉన్నతంగా ఉండేవారు. ఉపాధ్యాయులు, గురువుల సహకారంతో ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు.

రాజ్‌భవన్‌లో ఆహ్లాదకరంగా "ఎట్‌ హోం" - సీఎం దంపతులు సహా పలువురు ప్రముఖులు హాజరు - Governor At Home Program

వేలాది మందితో పోటీ పడి కెనడీ లూగర్‌ యూత్‌ ఎక్స్‌ఛేంచ్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరంపాటు సూర్యతేజశ్రీ అమెరికాలోనే ఉండనున్నారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో తెలియజేయనున్నారు. పేద కుటుంబంలో పుట్టిన తమ కుమార్తెకు ఆర్థిక సాయం అందించాలంటూ సూర్యతేజశ్రీ తల్లి నాగమణి ప్రజా దర్బార్‌లో లోకేశ్​కు వినతిపత్రం అందించారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్​ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఇద్దరిని సచివాలయానికి పిలిపించి అభినందించారు.

అమెరికాలో ఏడాది పాటు అందించే కోర్సుల్లో నచ్చినది అభ్యసించే అవకాశం ఉంటుంది. మాది పేద కుటుంబం. ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు సహాయం చేశారు. మమ్మల్ని తన కార్యాలయానికి పిలిచి అభినందించారు. రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. ఆయనే స్వయంగా రూ.లక్ష చెక్కు, ల్యాప్‌టాప్‌ అందించారు. ఈ సహాయం మరువలేనిది. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను అక్కడ చాటి చెబుతాం. చంద్రబాబు, లోకేశ్​లను స్పూర్తిగా తీసుకొని లక్ష్యసాధన కోసం ముందుకు సాగుతాం. మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు- సూర్యతేజశ్రీ, విద్యార్థిని.

నా కుమార్తె చదువు విషయం ప్రజా దర్బార్‌లో మంత్రి లోకేశ్‌కు విన్నవించాను. దీంతో ఆయన వెంటనే స్పందించారు. తన విదేశీ విద్యకు సాయం చేస్తామన్నారు. నా కుమార్తెను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. చదువుకున్న ప్రతి ఒక్కరు పేదరికంలోనే జీవించకూడదని లోకేశ్​ సాయం అందించారు. ఇంతటి సాయం చేసిన చంద్రబాబు, లోకేశ్​కు ప్రత్యేక ధన్యవాదాలు. - విద్యార్థిని కుటుంబసభ్యులు.

సీఎం చంద్రబాబు, లోకేశ్​ ఆర్థిక సాయం: ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ అందించారు. యూత్ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం ద్వారా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఆ బాలికలతో చంద్రబాబు అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఎక్కుడున్నా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్​ స్ఫూర్తితో లక్ష్య సాధన కోసం తాము ముందుకు సాగుతామని సూర్యతేజశ్రీ అన్నారు.

పేరుకు తగ్గట్లుగానే 'చరిష్మా' - ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​​ లక్ష్యమంటున్న విజయవాడ యువతి - Vijayawada Surya Charisma

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.