Chandrababu Fire on Jagan in Ra Kadalira Meeting: వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి తాము సిద్ధమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో రా కదలి రా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. ప్రజాకోర్టులో వైసీపీను శిక్షించే సమయం దగ్గర పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాయలసీమకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. ప్రాజెక్టుల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతామంటే ఎలా నమ్ముతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అబద్ధాల్లో జగన్ పీహెచ్‌డీ చేశారన్నారు. నా పాలనలో పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, కానీ జగన్ వచ్చాక అంతా పెరిగిపోయిందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం జగన్ రాజకీయ వ్యాపారి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు, మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్‌లో లెక్కేసుకోవడమే జగన్ పని అని చంద్రబాబు అన్నారు.
'Ra kadali Ra' Meeting in Uravakonda: టీడీపీ - జనసేన పొత్తుతోనే వైసీపీ ఓటమి ఖాయమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉరవకొండలో జరిగిన 'రా కదలి రా' బహిరంగసభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీ పాలనలో అన్ని విధాలుగా రాష్ట్రం నష్టపోయిందన్న చంద్రబాబు ప్రజలను చైతన్యం చేసేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. అనంతపురం జిల్లాకు రావాల్సిన జాకీ పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. జగన్‌కు కమిషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదా ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో విండ్ మిల్స్ చూసి ఆనందం కలిగిందని అన్నారు. మేం ఉన్నప్పుడు రాష్ట్రంలో కరెంట్ కొరత ఎప్పుడూ లేదని అన్నారు. టీడీపీ హయాంలో విండ్, సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. కానీ ఇప్పడు జగన్ కరెంట్ ఛార్జీలు పెంచి పేదల పొట్ట కొట్టారని అన్నారు.
ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించండి - స్పీకర్‌కు స్పష్టం చేసిన చంద్రబాబు
Chandrababu 'Ra kadali Ra' Public Meeting in Nellore: వైసీపీ అప్రజాస్వామిక పాలనను ఎండగడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరు, కర్నూలు జిల్లా పత్తికొండలో "రా కదలిరా" బహిరంగ సభలో పాల్గొననున్నారు. నెల్లూరు సభా ప్రాంగణాన్ని తెలుగుదేశం నేతలతో కలిసి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకోనున్న చంద్రబాబు 'రా కదలిరా' సభలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి పత్తికొండ వెళ్తారు. బహిరంగ సభ అనంతరం ఈరోజు రాత్రి పత్తికొండలోనే చంద్రబాబు బస చేయనున్నారు.
టీడీపీలోకి భారీగా చేరికలు - సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు
రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించిన ఏకైక పార్టీ తెలుగుదేశం: టీడీపీ నేతలు