ETV Bharat / state

పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలి - కేంద్ర ఎన్నికల సంఘం - EC RESTRICTIONS ON VOLUNTEERS

EC Orders Not to Disburse Pension Cash with Volunteers : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ ల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఏపీలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని, వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. మరోవైపు కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలతో పాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది.

EC RESTRICTIONS ON VOLUNTEERS
EC RESTRICTIONS ON VOLUNTEERS
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 6:23 PM IST

Updated : Mar 30, 2024, 9:44 PM IST

EC Orders Not to Disburse Pension Cash with Volunteers : వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవోను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్‌ ముగిసేవరకు వాలంటీర్ల ట్యాబ్, మెుబైల్‌ను కలెక్టర్ల వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సీఎఫ్‌డీ వేసిన పిటిషన్‌తో పాటు ఆ సంస్థ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఈసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.

ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు - పలువురిపై ఈసీ వేటు - Volunteers Election Code Violation

EC on APTET Results : టెట్‌ ఫలితాల విడుదల, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలతో పాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకపోగా పలు దఫాల అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటూ ఊరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల ముందు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వకుండా ఒకేసారి టెట్‌, డీఎస్సీలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.

టెట్‌, డీఎస్సీ మధ్య తగినంత సమయం లేదని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా రెండింటి మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. ఈరోజు నుంచి వచ్చే నెల 30 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు రీ షెడ్యూల్‌ చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో టెట్‌ ఫలితాల విడుదలకు, డీఎస్సీ నిర్వాహణకు ఈసీ అనుమతిని కోరుతూ అధికారులు ఈసీకి లేఖ రాశారు. కోడ్‌ ముగిసేవరకు టెట్‌ ఫలితాలతో పాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO

Citizens for Democracy Petition on Volunteers in Election Duties : సార్వత్రిక ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లను ఉపయోగించడంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్ట్‌ను ఇటీవలే ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 13 ని విచారణ జరిగింది. వాలంటీర్స్ క్రియాశీలకంగా వ్యవహరించాలని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగాలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేతల వ్యాఖ్యలపై ఏపీ సీఈవోకు వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదని న్యాయవాది తెలిపారు. ఈసీ ఆదేశాలు మేరకు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తిపై తగు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం రాష్ట్ర సీఈవో, ఈసీని ఆదేశించింది.

ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి పనులు వాలంటీర్లకు వద్దు - కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు

Last Updated : Mar 30, 2024, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.