ETV Bharat / state

ఏపీలో కొత్త ఎయిర్​పోర్ట్​లకు సర్వే- హెలికాప్టర్ క్రాష్ దర్యాప్తు జరుగుతోంది: రామ్మోహన్ నాయుడు - New Airports in AP - NEW AIRPORTS IN AP

Rammohan Naidu On New Airports in AP: ఇటీవల చోటు చేసుకున్న ఎయిర్ క్రాష్​పై విచారణ జరుగుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో కొత్త చేపట్టనున్న ఎయిర్​పోర్టుల కోసం సర్వే ప్రారంభమైందని తెలిపారు. చంద్రబాబు రాకతో ఏపీ ఇమేజ్ పెరుగుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని రామ్మోహన్​ నాయుడు అన్నారు.

Rammohan Naidu On New Airports in AP
Rammohan Naidu On New Airports in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 9:31 PM IST

Rammohan Naidu On New Airports in AP : ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని నివేదిక అందిన తర్వాతే దానిపై మాట్లాడతానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉందని అన్నారు.

Survey for New Airports in AP : రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని, 7 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురం లలో వీటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమో ను అక్టోబర్​లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

గతంలోనూ సీ ప్లేన్ కార్యకలాపాలపై ప్రయత్నాలు జరిగినా నిబంధనలు ఇబ్బంది కారణంగా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. సీ ప్లేన్ కేవలం పర్యాటకం కోసమే కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నామని అన్నారు.విమానాశ్రయానికి వేల ఎకరాల్లో భూమి అవసర సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. ఉన్న విమానాశ్రయాల సామర్ధ్యం పెంచుతున్నామని విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రికమండేషన్స్-ఫార్మాలిటీస్​ పనిచేయవ్! డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఆర్టీఏ కొత్త విధానం - Automatic Driving Testing Track

ఏపీ ఇమేజ్ పెరుగుతోంది : రాష్ట్ర ఎన్నికల్లో ప్రజా తీర్పును వైఎస్సర్సీపీ వక్రీకరిస్తోందని రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం కల్పించేందుకే సెప్టెంబర్1 నుంచి రెవెన్యూ సదస్సులు పెడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. చంద్రబాబు సీఎం అవ్వటంతో దిల్లీతో పాటు జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోందని అన్నారు.

నాయకులకు, ప్రజలకు అనుసంధానం కొనసాగేలా ప్రవే శపెట్టిన ప్రజా దర్బార్ సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేందుకే ప్రజా సమస్యలు స్వయంగా స్వీకరించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తున్నామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసిందని, న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ అంశంపై తాను మాట్లాడననని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో విమానయాన అభివృద్ధికి చర్యలు- ఆరు నెలల ముందే భోగాపురం పూర్తి : కేంద్రమంత్రి రామ్మోహన్‌ - Rammohan on Bhogapuram Airport

బోయింగ్‌ విమానాలు, జిల్లాకో ఎయిర్ పోర్టంటూ ప్రగల్భాలు! ఉన్న సర్వీసులే రద్దు- అడుగులు దాటని ఎయిర్‌పోర్టులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.