Central Election Commission Appointed 3 Special Observers For Ap: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రత్యేక పోలీసు అబ్జర్వర్‌గా దీపక్ మిశ్రా, ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌గా రామ్ మోహన్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ అబ్జర్వర్‌గా నీనా నిగమ్‌ను నియమిస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి రానున్న ప్రత్యేక అబ్జర్వర్లు వచ్చే వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేసింది.
ఈసీ మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేయటంతో పాటు రాష్ట్ర సరిహద్దు, సమస్యాత్మక ప్రాంతాలు, ఓటర్లను ఆకర్షించే ఉచితాలు, తాయిలాల నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక పరిశీలకులు దృష్టి పెట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (Chief Electoral Officer) ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
ఇంటింటి ప్రచారానికి సువిధ పోర్టల్‌లో దరఖాస్తు తప్పనిసరి: ఈసీ - Suvidha Portal For campaign
Chief Secretary Jawahar Reddy Review: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు, ఉత్పత్తి, నియంత్రణ అంశాలపై సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి (Chief Secretary jawahar reddy) సమీక్ష నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులతో జవహర్ రెడ్డి సమీక్షించారు. సమీక్షకు ఎన్నికల అధికారులు, ఎక్సైజు, బెవరేజెస్ కార్పొరేషన్ , సెబ్ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. విజయవాడ, విశాఖ పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు కూడా హాజరయ్యారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మద్యం ఉత్పత్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ ను సీఎస్ ఆదేశించారు. అక్రమ మద్యం సరఫరా కాకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద నిఘా (Focus) పెట్టాలని ఆదేశాలు జారీచేశారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీ చేయాల్సిందిగా అధికారులను జవహర్ రెడ్డి ఆదేశించారు. కర్ణాటక నుంచి టెట్రా ప్యాక్‌లు, తెలంగాణా నుంచి బ్రాండెడ్ మద్యం అక్రమ రవాణా అవుతున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ఎన్నికల కమిషన్ (EC) పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాజకీయ పార్టీలు వారి కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్‌లు, బ్యానర్లను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల్లో వాటిని శాశ్వత ప్రాతిపదికన అనుమతులతో ఏర్పాటు చేసినందున తొలగించాల్సిన అవసరం లేదని అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని 'సువిధ' పోర్టల్ లో 48గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని తెలిపారు.
ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలన్న ఈసీ నిబంధనపై ప్రధాన పార్టీల అభ్యంతరం!