Caste equalization in Chandrababu cabinet: తనతోపాటు పవన్ కల్యాణ్ కు సమాన గౌరవం ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. దీంతో మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి బెర్త్ ఖాయమని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక మంత్రివర్గంలో మిగిలిన వారు ఎవరెవరనే సస్పెన్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.
మరికాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుందన్నది తేలిపోనుండటంతో ఆశావాహులు అధినేత నుంచి ఫోన్‌కాల్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాల వారీగా ఆశావాహులను పరిశీలిస్తే.., ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి కొండ్రు మురళి, అయితా బత్తుల ఆనందరావు, నక్కా ఆనంద్ బాబు, డోలా బాల వీరాంజనేయ స్వామి, జనసేన కోటా నుంచి వర ప్రసాద్‌లో ఒకరు లేదా ఇద్దరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి అనిత, సౌమ్య, ఎంఎస్ రాజు ల్లో ఒకరికి ఛాన్స్ దక్కచ్చు.
ఎస్టీ సామాజిక వర్గంనుంచి గుమ్మడి సంధ్యారాణి, పోలవరం జనసేన ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ముస్లిం మైనారిటీ నుంచి ఫరూక్, షాజహాన్ భాష, గుంటూరు నజీర్ ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి లోకం మాధవి, ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్య, టీజీ భరత్, క్షత్రియ సామాజిక వర్గం నుంచి అదితి గజపతి రాజు, బీజేపీ విష్ణుకుమార్ రాజు కు అవకాశం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చని తెలుస్తోంది.
రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం - ఇకపై అమరావతే రాజధాని - విశాఖను ఆర్థిక రాజధానిగా చేసుకుందాం : చంద్రబాబు - Chandrababu oath Ceremony As cm
రెడ్డి సామాజికవర్గం నుంచి నల్లారి కిషోర్, కోట్ల, బీసీ జనార్దన్ రెడ్డి, మాధవి రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, సోమిరెడ్డి, కోటంరెడ్డి. ముగ్గురు లేదా నలుగురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాపు సామాజికవర్గం నుంచి జనసేన నుంచి పవన్ కల్యాణ్, నిమ్మల, నారాయణ, జ్యోతుల నెహ్రు, కన్నాలక్ష్మీనారాయణల్లో ముగ్గురు లేదా నలుగురికి అవకాశం దక్కచ్చు. కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ నుంచి సుజనా చౌదరిల్లో ముగ్గురు లేదా నలుగురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.
బీసీ, యాదవ సామాజిక వర్గం నుంచి యనమల, పల్లా శ్రీనివాస్, పార్థసారథి, బీదా రవిచంద్ర, బీజేపీ నుంచి సత్యకుమార్‌ల్లో ఒకరు లేదా ఇద్దరికి, బీసీ మత్స్యకార కొల్లు రవీంద్ర లేదా కొండబాబు, బీసీ తూర్పు కాపు కళావెంకట్రావు, బీసీ, కొప్పుల వెలమ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కోళ్ల లలిత, బీసీ గౌడ గౌతు శిరీష లేదా అనగాని సత్యప్రసాద్, బీసీ, శెట్టిబలిజ పితాని సత్యనారాయణ, వాసం శెట్టి శుభాస్, బీసీ- కళింగ నుంచి కూనరవికుమార్, బెందాళం అశోక్, బీసీ- జనసేన నుంచి గవర కొణతాల రామకృష్ణ బీసీ- బోయ బీజేపీ నుంచి పార్థసారథి లేదా కాల్వకురబ సవితకు అవకాశం దక్కనుంది.
తాజా శాసనసభలో మహిళల సంఖ్య 21కి చేరింది. గతానికన్నా(14) మూడో వంతు అధికం. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందటంతో ఆమేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్న వారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్ధ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈపరిణామం కొందరి అవకాశాలకు గండిపడొచ్చు.