ETV Bharat / state

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - 8 మందికి గాయాలు - Blast in Fire Crackers Factory - BLAST IN FIRE CRACKERS FACTORY

Blast in Fire Crackers Factory at Amalapuram of Konaseema District : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచా పేలి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు చేరుకుని పరిశీలిస్తున్నారు.

BLAST IN FIRE CRACKERS FACTORY
BLAST IN FIRE CRACKERS FACTORY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 1:05 PM IST

Updated : Sep 16, 2024, 3:21 PM IST

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - 14 మందికి గాయాలు (ETV Bharat)

Blast in Fire Crackers Factory at Amalapuram of Konaseema District : అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురంలోని రావులచెరువు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాణసంచా తయారీ చేస్తున్న ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిసర ప్రాంతాల్లోని మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం మరికొందరిని కిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని గువ్వాల నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంట్లో దీపావళి మందు గుండు సామగ్రి తయారీ చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.

పేలుడు ధాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ధ్వంసమైన భవనం శిథిలాలను ప్రొక్లెయిన్‌ సాయంతో తొలగిస్తున్నారు.

పామాయిల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - 3F Palm Oil Industry Fire Accident

నివాస ప్రాంతాల మధ్య బాణసంచా తయారు చేయొద్దని యజమాని గువ్వాల నాగేశ్వరరావుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉన్నాయంటూ బెదిరించే వారిని వాపోయారు.

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - లక్షల్లో ఆస్తి నష్టం - Rajam Fire Accident Today

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - దంపతులు మృతి - BLAST IN CRACKERS COMPANY

Last Updated : Sep 16, 2024, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.