ETV Bharat / state

పవన్​ పైలట్​కు అనుమతులు నిరాకరించిన ఎయిర్​పోర్టు అధికారులు- సభకు వెళ్లేందుకు గంటపాటు నిరీక్షణ - Officials No permission Pawan pilot - OFFICIALS NO PERMISSION PAWAN PILOT

Authorities Not Give Permission to Pawan Kalyan Helicopter Pilot: కోనసీమ జిల్లా అంబాజీపేటలో సభకు బయలుదేరిన పవన్​ కల్యాణ్​ పైలట్​కు రాజమహేంద్రవరం ఎయిర్​పోర్టు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో గంటపాటు సభకు వెళ్లకుండా వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికే అంబాజీపేటలో వేచి ఉన్న చంద్రబాబుకు సమాచారం తెలియడంతో తన హెలికాప్టర్‌కు చెందిన కోపైౖలెట్‌ సాయంతో పవన్‌ బయలుదేరి కోనసీమ చేరుకున్నారు.

Authorities Not Give Permission to Pawan Kalyan Helicopter Pilot

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 9:09 AM IST

Authorities Not Give Permission to Pawan Kalyan Helicopter Pilot: కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, అమలాపురం టీడీపీ, జనసేన ఉమ్మడి సభలకు బయలుదేరిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం విమానాశ్రయంలో గంటన్నరపాటు నిరీక్షించాల్సి వచ్చింది. అంబాజీపేట బహిరంగ సభకు వెళ్లేందుకు షెల్టాన్ హోటల్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పవన్​ విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్​ను తీసుకువెళ్లే పైలట్​కు అనుమతులు లేకపోవడంతో గంటన్నరపాటు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పవన్ పైలట్​కు విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు అనుమతులు నిరాకరించారు. అనుమతి ధృవీకరణపత్రం లేకపోవడంతో పైలట్​కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన వీఐపీ లాంజ్​లో వేచి ఉండాల్సి వచ్చింది.

కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయుత- అంబాజీపేటలో చంద్రబాబు - Chandrababu Naidu Election Campaign

సమాచారం తెలుసుకున్న చంద్రబాబు ప్రోగ్రాం కన్వీనరు పెందుర్తి వెంకటేష్, సంబంధిత కంపెనీ ప్రతినిధులతో ఆయన సంప్రదింపులు జరిపారు. చంద్రబాబు ప్రయాణించిన హెలికాఫ్టర్ అదే సమయంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే అంబాజీపేటలో వేచి ఉన్న చంద్రబాబుకు ఈ సమాచారం తెలియడంతో రాజమహేంద్రవరంలోనే ఉన్న తన హెలికాప్టర్‌కు చెందిన కోపైౖలెట్‌ సాయంతో పవన్‌ దాదాపు గంట అనంతరం బయలుదేరి కోనసీమ చేరుకున్నారు.

పవన్ హెలికాఫ్టర్​లో రాకుండా వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమలాపురం బహిరంగ సభలో జగన్​పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తుంటే జగన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అందుకే అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆఖరుకు పిరికితనంతో పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌నూ అడ్డుకునేందుకు కుట్ర పన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అంబాజీపేట, అమలాపురంలో సభలకు రాజమహేంద్రవరం నుంచి పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌లో రాకుండా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. చివరకు నేను నా హెలికాప్టర్‌ను పవన్‌ కోసం పంపాల్సి వచ్చిందన్నారు. అధికారులూ మీరంతా ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు.

కోనసీమను వైసీపీ కలహాల సీమగా మార్చే యత్నం చేసింది- పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan at Prajagalam

పవన్‌ హెలికాప్టర్‌ కోపైలెట్‌కు బేగంపేటలో ఇచ్చినట్లే తాత్కాలిక పాస్‌ ఇవ్వమని కోరినా నిబంధనలు ప్రకారం సాధ్యం కాదనే సమాధానం వచ్చిందని చెబుతున్నారు. బేగంపేటలో లేని ఇబ్బంది, రాజమహేంద్రవరంలో ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం కరవైంది. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమహేంద్రవరం విమానాశ్రయ ఏపీడీ జ్ఞానేశ్వర్‌ను వివరణ కోరగా, కోపైలెట్‌కు ఎయిర్‌పోర్టు ఎంట్రీ పర్మిట్‌ లేనందున, సెక్యూరిటీ కారణాలతో అభ్యంతరం తెలిపామన్నారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.