AP People Deposed YSRCP Leaders : ఎన్నికల ప్రచారంలో అధికార నేతలకు అడుగడుగున ప్రశ్నల వర్షంతో స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ గత ఎన్నికల్లో గెలిచి, ఈ ఐదేళ్ల తమకు ఏం చేశారని వైఎస్సార్సీపీ నాయకులను నిలదీస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను తీర్చిన తరవాతే ఓట్లు అడిగేందుకు రావాలని తేల్చి చెప్పారు. స్థానికులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలేక సంఘటన స్థలం నుంచి మెల్లగా జారుకుంటున్నారు.
Railway Kodur People Fire on YSRCP Leaders in Annamayya District : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూర్‌వారిపల్లి గ్రామంలో కొరముట్ల శ్రీనివాసుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో స్థానిక మహిళలు ఎమ్మెల్యే అనుచరులతో వాగ్వాదానికి దిగారు. గ్రామ పరిధిలోని హరిజనవాడకు పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. ఇష్టారీతిన జగన్ పాటలు పెట్టడంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోపే ఎమ్మెల్యే తన వాహనంలో అక్కడికి చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Kurnool People Fire on YSRCP MLA : కర్నూల్ జిల్లా కోసిగిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. మా కాలనీకి అయిదేళ్లుగా తాగునీటి సమస్య తీర్చి ఓట్లు అడిగేందుకు రావాలని ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జీ మురళీ మోహన్ రెడ్డిని కోసిగి దుర్గానగర్ కాలనీవాసులు నిలదీశారు. స్థానికులు అడిగినా ప్రశ్నలకు సమాధానం చెప్పాలేని వైఎస్సార్సీపీ నేతలు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కోసిగిలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే నాడిగేని గేరిలో ప్రచార రథంపై వస్తుండగా ముందుగా దుర్గానగర్ కాలనీవాసులు ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానిక ఎస్సై సతీశ్ కుమార్ వచ్చి వారిని చెదరగొట్టారు. అయినా కాలనీవాసులు పట్టుబడటంతో వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జీ మురళీమోహన్ రెడ్డి ఘటనా స్థలానికి రాగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీ వారికి సర్దిచెప్పడంతో వెనుదిరిగారు.
సొంత ఇలాకాలో జగన్కు ఊహించని కలవరం - వైఎస్ భారతికి నిరసనలపర్వం - Protest To YS Bharathi