AP JAC Announced Agitation: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న వ్యతిరేక విధానంపై ఉద్యమానికి దిగుతున్నట్లు ఎపీ జేఎసీ ప్రకటించింది. 104 ఉద్యోగ సంఘాలు, కార్యవర్గంతో ఎపీ జేఎసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఎపీజేఎసీ నేతలు చర్చల అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఏపీ జేఏసీ విడుదల చేసింది.
ఈ నెల 27న ఉద్యోగులతో చలో విజయవాడ చేపట్టబోతున్నట్లు ఏపీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనెల 14వ తేదీన నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని తహసిల్దార్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల్లో మెమొరాండంలు సమర్పించాలని నిర్ణయించినట్లు వివరించారు. 15, 16వ తేదీల్లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో పాఠశాలలు, పాఠశాలల్లో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
బకాయిల జీవో జారీ చేశారు, నిధులు చెల్లింపు మరిచారు- సీఎం హామీలే అమలవ్వకపోతే ఎలా? : బొప్పరాజు
17వ తేదీన తాలుఖా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 20వ తేదీన కలెక్టరెట్ల వద్ద ధర్నా చేయబోతున్నట్లు ఎపీ జేఎసీ నేత బండి శ్రీనివాస్ వెెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు అన్ని జిల్లాల పర్యటన చేపట్టబోతున్నామని వివరించారు.
ఇన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే, ఏ నిమిషంలోనైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. పీఆర్సీ పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదని ఏపీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలియదనీ, కనీసం కార్యాలయం, స్టాఫ్ కూడా లేరని ఎద్దేవా చేశారు. రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉందని, జీపీఎఫ్ బిల్లుల చెల్లింపులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవన్నారు.
'నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం, ఇక తప్పదు' - 27వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె
ప్రభుత్వం ప్రతినెల 1 వ తారీఖున వేతనాలు, పెన్షన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజున ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయని అవి సఫలం కాకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చకుంటే ఉద్యమ శంఖారావం పూరిస్తామన్నారు. జీపీఎస్‌లోని అంశాలనే జీపీఎస్‌లో పెట్టి ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని, క్వాంటం ఆఫ్ పెన్షన్‌లో పెన్షనర్లకు ప్రభుత్వం నష్టం చేసిందని ఎపీ జేఎసీ సెక్రటరీ జనరల్ హృదయరాజ్ అన్నారు.
బకాయిలను తక్షణమే చెల్లించాలి - ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు : బొప్పరాజు