ETV Bharat / state

ఈసీ అనుమతి లేదు- హైకోర్టు ధర్మాసనం - Govt Scheme Funds Distribution - GOVT SCHEME FUNDS DISTRIBUTION

AP High Court On Government Scheme Funds Distribution Issue: ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈనెల 9న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అప్పీళ్లపై విచారణ జరిపి ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణను సెప్టెంబర్‌ 2కు వాయిదా వేసింది.

AP High Court On Government Scheme Funds Distribution Issue
AP High Court On Government Scheme Funds Distribution Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 10:54 AM IST

AP High Court On Government Scheme Funds Distribution Issue : ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈనెల 9న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది. ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రానందున రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఈనెల 10న నిధుల పంపిణీ చేయలేదని తెలిపింది. మరోవైపు ఈనెల 11 నుంచి 13లోపు సొమ్ము జమచేయడానికి వీల్లేదని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారని గుర్తు చేసింది. మే 11 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్‌ పిరియడ్‌ ప్రారంభమవుతుందని పేర్కొంది. మరోవైపు ఓటింగ్‌ 13న జరిగిన మరుసటి రోజు (14న) లబ్ధిదారులకు సొమ్ము జమచేయవచ్చని ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌దేశాయ్‌ తెలిపారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అప్పీళ్లపై విచారణ జరిపి ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణను సెప్టెంబర్‌ 2కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ 'నవతరం పార్టీ' జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ధర్మాసనం ముందు అత్యవసరంగా వేర్వేరు అప్పీళ్లు వేశారు. విచారణ సందర్భంగా ఈసీ తీరుపై ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. నిధుల జమ విషయంలో ఈసీ ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి తాత్కాలికంగా పక్కనపెట్టినప్పుడు (అబయన్స్‌) ప్రభుత్వాన్ని మరికొంత స్పష్టత కోరడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలుకు వీలుగా రాష్ట్రప్రభుత్వానికి ఎన్‌ఓసీ ఎందుకు ఇవ్వలేదని ఈసీని ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలను అమలు చేయనప్పుడు అప్పీల్‌ ఎందుకు వేయలేదని వ్యాఖ్యానించింది. ఓ వైపు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను అమలు చేయకుండా మరోవైపు అభ్యంతరం ఉంటే ఆ ఉత్తర్వులపై అప్పీల్‌ వేయకుండా ఉంటే ఏవిధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది. హైకోర్టు కంటే ఈసీ ఎక్కువ కాదంది.

జగన్‌ ప్లాన్​ను అడ్డుకున్న ఈసీ! పోలింగుకు ముందు రూ.14,165 కోట్ల పంపిణీకి స్కెచ్‌ - EC Orders to AP Govt

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాల విషయంలో ఈసీ భిన్న వైఖరి అనుసరించడం సరికాదంది. ఓటింగ్‌ తేదీ ముగిశాకైనా ప్రభుత్వాన్ని వివరణ కోరకుండా నిధుల పంపిణీకి అనుమతిస్తారా? లేదా? అని సూటిగా ప్రశ్నించింది. పోలింగ్‌ తేదీకి ముందు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయవద్దని, ఓటింగ్‌ ముగిసిన మరుసటి రోజు(14న) చేపట్ట వచ్చిన పేర్కొంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పోలింగ్‌ తేదీ ముగిశాకే నిధులను జమచేయాలని ఈనెల 9న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీ వరకు తాత్కాలికంగా పక్కనపెట్టారు. 11 నుంచి 13 వరకు నిధులను జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అప్పీలుదారు తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఏఎస్‌ నాదకర్ణి, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. 'సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులు ఆసాధారణంగా ఉన్నాయన్నారు. ఈసీ ఉత్తర్వుల అమలును 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయడం సరికాదన్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వానికి 10వ తేదీన నిధులు జమచేసేందుకు వెసులుబాటు ఇచ్చినట్లయిందని కోర్టుకు తెలిపారు. పోలింగ్‌ తేదీకి ఒకటి, రెండు రోజుల ముందు అధికార పార్టీకి సొమ్ము జమచేసే అవకాశం ఇవ్వడం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సమాన అవకాశాలను దెబ్బతీయడం అవుతుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో ఉన్నప్పుడు కొత్తపథకాలకే కాకుండా పాతపథకాల విషయంలోనూ ఈసీ అనుమతి తప్పని సరి అవుతుందని తెలిపారు. పోలింగ్‌ తేదీకి ఒకటి, రెండు రోజుల ముందు రూ 14వేల కోట్ల సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తే నిష్పాక్షిక ఎన్నికలు అనిపించుకోవని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారీస్థాయిలో సొమ్ము జమచేయడానికి అనుమతిస్తే అధికార పార్టీ అభ్యర్థులకు లబ్ధి జరుగుతుంది. ఇతర రాజకీయ పార్టీ అభ్యర్థుల అవకాశాలు దెబ్బతింటాయన్నారు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకాలయినప్పటికీ పోలింగ్‌ తేదీకి ముందు లబ్ధిదారులకు నిధులు పంపిణీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పోలింగ్‌ తేదీ తర్వాత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తే కలిగే నష్టమేమి ఉండదు' అని అన్నారు.

చూశారా.. ఇదీ జగన్ మార్క్ మోసం! - Jagan cheating in Funds Release

రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల తర్వాత సైతం ఎన్‌ఓసీ ఇవ్వకుండా ఈసీ మరిన్ని వివరాలు కోరిందన్నారు. ఎన్‌ఓసీ లేకుండా ఈనెల 10న నిధుల జమ సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయలదన్నారు. రాష్ట్రాలు, అక్కడి ప్రభుత్వాల ఆధారంగా ఈసీ ఎన్నికల కోడ్‌ను అమలు చేస్తోందన్నారు. భిన్నవైఖరులు అవలంభిస్తోందన్నారు. ఈసీ నిర్ణయాలపై లోతైన విచారణ జరపాలన్నారు. అప్పీళ్లపై విచారణను మూసి వేయవద్దని కోరారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌దేశాయ్‌ వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో నిధులను పంపిణీ చేయవచ్చని స్పష్టంగా పేర్కొనలేదన్నారు. పోలింగ్‌ తేదీ ముగిశాక 14వ తేదీన లబ్ధిదారులకు నిధుల జమచేస్తే అభ్యంతరం లేదన్నారు.

ఈరోజే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? - సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ లేఖ - EC letter to ysrcp Govt on DBT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.